BAPS Temple in Abu Dhabi: ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబిలోని Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandirని ప్రారంభించనున్నారు. గల్ఫ్ దేశాల్లో నిర్మించిన తొలి హిందూ దేవాలయమిదే కావడం వల్ల అందరి దృష్టినీ ఆకర్షించింది. పైగా ప్రధాని మోదీ ప్రారంభిస్తుండడం వల్ల మరింత ఆసక్తి పెరిగింది. గల్ఫ్ దేశాల్లోని హిందువులకు ప్రాధాన్యతనిస్తూ అక్కడి ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో సహకరించింది. అంతే కాదు. భారత్-యూఏఈ మధ్య మైత్రిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లనుంది ఈ మందిర నిర్మాణం.
ఆలయ విశేషాలివే...
1. అబుదాబి దుబాయ్ హైవేకి సమీపంలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మొత్తం 27 ఎకరాల్లో ఈ నిర్మాణం చేపట్టారు.
2. 2019 నుంచి ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. 2015లో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం 13.5 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ తరవాత 2019లో మరోసారి 13.5 ఎకరాలను అందించింది. ఇలా మొత్తంగా 27 ఎకరాల్లో నిర్మాణాన్ని చేపట్టేలా సహకరించింది.
3.ఈ ఆలయాన్నీ అయోధ్య తరహాలోనే నాగర శైలిలో నిర్మించారు. మొత్తం ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు. ఆలయ ముందు భాగంలో హిందూ సంస్కృతి విలువలు ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టారు. రకరకాల సంస్కృతులను,ఆధ్యాత్మికవేత్తల చిత్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం UAEలోని 7 ఎమిరేట్స్‌ని సూచించేలా ఏడు శిఖరాలు నిర్మించారు.
4.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇవాళ (ఫిబ్రవరి 14) ప్రారంభమైనప్పటికీ ఇది మార్చి 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది
5. మొత్తం రాతితోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు. స్టీల్, కాంక్రీట్‌ని వినియోగించలేదు. ఇది గల్ఫ్‌లోనే మూడో అతి పెద్ద నిర్మాణంగా రికార్డు సృష్టించింది. UAEలోని దుబాయ్‌లో మూడు హిందూ ఆలయాలున్నాయి.
6. ఈ ఆలయంలో విజిటర్స్ సెంటర్, లైబ్రరీ, క్లాస్‌రూమ్, ప్రేయర్ రూమ్, కమ్యూనిటీ సెంటర్, ప్లే గ్రౌండ్ నిర్మించారు. వీటితో పాటు పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటవుతుంది.
పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం...దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు. సంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మాణం జరిగింది. యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతీకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు. ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది.