APPSC Group2 Halltickets: ఏపీలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్ష హాల్‌టికెట్లను ఫిబ్రవరి 14న ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్క్రీనింగ్ పరీక్ష (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ)  నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందుగా చేరుకోవాలని ఏపీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది.


ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్(Excutive), 566 నాన్-ఎగ్జిక్యూటివ్(Non Excutive) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జవనరి 17తో గడువు ముగియనుంది.  


గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 


* గ్రూప్-2 పోస్టుల వివరాలు


ఖాళీల సంఖ్య: 899


➥ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 333


➥ నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 566


అర్హత: డిగ్రీ, ఆపై విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-42 సంవత్సరాల మధ్య ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.


ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష విధానం:



ALSO READ:


ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 అనలిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్-2 (Analyst Grade-2) ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..