Jio Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అనేక కొత్త ప్లాన్‌లను తీసుకువస్తూనే ఉంది. అయితే కంపెనీ ఇటీవల తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచింది. ఆ తర్వాత చాలా మంది ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. కానీ దీని తర్వాత కూడా జియో ఒక మంచి ప్లాన్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రజలు ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతారు. అదే సమయంలో దీని ధర కూడా రూ.200 కంటే తక్కువ. ఇప్పుడు ఈ ప్లాన్ వివరాల గురించి తెలుసుకుందాం.


జియో రూ.175 ప్లాన్
ఈ జియో ప్లాన్ ధర కేవలం రూ. 175 మాత్రమే. ఇది డేటా ఓన్లీ ప్లాన్. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో యూజర్లు 10 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాకుండా రోజువారీ డేటా క్యాప్ అవసరం లేకుండా స్ట్రీమింగ్, బ్రౌజింగ్ వంటి అనేక ఆన్‌లైన్ యాక్టివిటీస్ చేయాలనుకునే యూజర్లకు ఈ డేటా ప్లాన్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఈ ప్లాన్‌లో ప్రజలు రోజువారీ ప్లాన్‌ల వంటి అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్ వంటి సౌకర్యాలను పొందలేరు. అయితే ఇంటర్నెట్ లవర్స్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా ప్రజలు ఈ ప్లాన్‌లో ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లను కూడా పొందుతారు. ఇందులో యూజర్లు 28 రోజుల పాటు జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, జియో టీవీ మొబైల్ యాప్, సోనీ లివ్, జీ5 వంటి ప్లాట్‌ఫారమ్‌లకు సులభంగా యాక్సెస్ పొందుతారు.


ఇంటర్నెట్ బేస్డ్ ప్లాన్ ఇది...
వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్‌లకు బదులుగా ఇంటర్నెట్ డేటాను ఇష్టపడే వారికి 175 రూపాయల ఈ జియో ప్లాన్ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఇంటర్నెట్ బేస్డ్ ప్లాన్, ఇందులో ప్రజలు ఎక్కువ డేటాతో పాటు అనేక ఓటీటీ సబ్‌స్కిప్షన్లకు ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఈ ప్లాన్ ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్‌లతో పోటీపడుతుంది.



Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే