రిలయన్స్ జియో ఇప్పటికే 8 నగరాల్లో 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా, బెంగళూరు, హైదరాబాద్ సరికొత్త నెట్వర్క్ సేవలను అందిస్తోంది. ఈ నగరాల్లో ఉంటున్న జియో వినియోగదారులు My Jio యాప్‌లో వెల్ కం ఆఫర్ ను అందుకుంటారు. ఆ తర్వాత యాక్టివ్ 5G నెట్ వర్క్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2023 నాటికి దేశం అంతటా 5G సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం ప్రొవైడర్ జియో ఇప్పటికే వెల్లడించింది. 5G నెట్‌వర్క్ కు సంబంధించి మరిన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
SMS, నోటిఫికేషన్ ద్వారా వెల్ కమ్ ఆఫర్
ఢిల్లీ, ముంబై లేదా Jio 5G అందుబాటులో ఉన్న ఏదైనా నగరంలో నివసిస్తున్నట్లయితే, వినయోగదారులు MyJio యాప్ నుంచి SMS లేదంటే నోటిఫికేషన్ అందుకుంటారు. మెసేజ్‌లో Jio 5G వెల్ కమ్ ఆఫర్, దాని ప్రయోజనాన్ని ఎలా పొందాలి అనే సమాచారం ఉంటుంది. 5G సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్లు ఉన్న వినియోగదారులు 5G సేవలను కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 5G నెట్ వర్క్ యాక్సెస్ కోసం, రిలయన్స్ జియో ఒక ప్రత్యేకమైన లాంచ్ డీల్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ డీల్ పొందే అవకాశం ఉన్న వారికి Jio 500 Mbps, 1 Gbps మధ్య వేగంతో అపరిమిత 5G డేటా వినియోగాన్ని అందిస్తోంది.
ఈ స్టెప్స్ ఫాలోకండి, నెట్వర్క్ యాక్సెస్ చేసుకోండి!
వినియోగదారులు ఇప్పటికే నోటిఫికేషన్‌ను స్వీకరించినా, 5Gకి కనెక్ట్ చేయడంలో సమస్య ఉన్నట్లయితే కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ఆ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. Jio 5G నెట్ వర్క్ ని మీ స్మార్ట్ ఫోన్‌లో యాక్టివేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ లో ముందుగా సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత జియో సిమ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫర్డ్ నెట్ వర్క్ టైప్ ను ఎంచుకోవాలి. ఇందులో 3G, 4G, 5G ఎంపికలను కలిగి ఉంటారు. ఇప్పుడు 5Gని సెలెక్ట్ చేసుకోవాలి. 5G నెట్ వర్క్ ని ఎంచుకున్న తర్వాత స్మార్ట్ ఫోన్ నెట్ వర్క్ స్టేటస్ బార్ లో 5G గుర్తును గమనించవచ్చు.
4G SIM 5G సేవలకు సపోర్ట్ చేస్తుందన్న జియో, ఎయిర్ టెల్
ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ 5Gని పొందడానికి కస్టమర్‌లు కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయనవసరం లేదని వెల్లడించాయి. ఆయా ప్రాంతాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రస్తుత 4G SIM 5G కి కూడా సపోర్ట్ చేస్తుందని తెలిపాయి. 5G సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ ఉండటంతో పాటు మీరు నివసించే ప్రాంతంలో 5Gకి యాక్సెస్ ఉంటే ఆటోమేటిక్ గా 5G సేవలను పొందే అవకాశం ఉంటుందని తెలిపాయి. ముందుగా, సాఫ్ట్ వేర్ అప్ డేట్ మీ 5G ఫోన్‌లో ఇన్ స్టాల్ చేయబడిందో? లేదో? ముందుగా నిర్దారించుకోవాలని సూచించాయి. మెజారిటీ స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇప్పటికే అప్ గ్రేడ్ చేసినప్పటికీ, డిసెంబర్ నాటికి ఆపిల్ అప్‌గ్రేడ్‌ను అందిచబోతున్నట్లు వెల్లడించింది.
Read Also: 5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు, డౌన్ లోడ్ స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవుతారు