ఐటెల్ విజన్ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


ఐటెల్ విజన్ 3 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. డీప్ ఓషన్ బ్లాక్, జువెల్ బ్లూ, మల్టీ కలర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


ఐటెల్ విజన్ 3 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. వాటర్ డ్రాప్ తరహా డిజైన్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ఏఐ బ్యూటీ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్, పనో మోడ్, లో లైట్ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ రికగ్నిషన్, ఆటోమేటిక్ కెమెరా అడ్జస్ట్ మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇందులో ఏఐ బ్యూటీ మోడ్ కూడా అందించారు.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?