ఐకూ గతంలో చైనాలో ఐకూ నియో 5 అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇందులో 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను లాంచ్ చేశారు. గతంలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఐకూ నియో 5లో 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 3,399 యువాన్లుగా(మనదేశ కరెన్సీలో రూ.39,700) నిర్ణయించారు.


ఈ కొత్త వేరియంట్ సేల్ నవంబర్ 1వ తేదీ నుంచి జరగనుంది. నైట్ షాడో బ్లాక్, క్లౌడ్ షాడో బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. గతంలో వచ్చిన స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి కేవలం స్టోరేజ్ విషయంలో మాత్రమే మార్పులు చేశారు. మిగతా ఫీచర్లన్నీ అలానే ఉన్నాయి.


ఐకూ నియో 5 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.62 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సర్టిఫికేషన్ కూడా ఇందులో అందించారు. ఈ డిస్‌ప్లే టచ్ శాంప్లింగ్ రేట్ 1000 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


Also Read: ఈ ల్యాప్‌టాప్‌లో సిమ్ కూడా వేసుకోవచ్చు.. అమెజాన్‌లో రూ.15 వేల వరకు తగ్గింపు!


12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వివో ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ నియో 5 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


Also Read: హెచ్‌పీ 14(2021) పదో తరం ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఐకూ క్రాఫ్టన్‌తో కలిసి ఒక గేమింగ్ టోర్నమెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ గేమింగ్ టోర్నమెంట్‌కు ఐకూనే టైటిల్ స్పాన్సర్‌గా ఉండనుంది. మనదేశంలో అతి పెద్ద బాటిల్ రాయల్ ఎస్కార్ట్స్ ఈవెంట్ అదే అని తెలుస్తోంది. దీని ప్రైజ్ మనీ రూ.కోటి వరకు ఉండనుందని తెలుస్తోంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి