ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఆఫర్ సేల్స్‌లో మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా.. గేమింగ్, కోడింగ్, ఆఫీస్ వర్క్.. ఇలా అన్నిటికీ ఉపయోగపడే హెచ్‌పీ ల్యాప్‌టాప్ మంచి ఆఫర్‌తో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్‌పై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే హెచ్‌పీ 14(2021) పదో తరం ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇది ఒక తేలికైన ల్యాప్‌టాప్. సిల్వర్ కలర్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.77,996 కాగా, ఈ సేల్‌లో రూ.64,990కే కొనుగోలు చేయవచ్చు. ఎమ్మార్పీపై ఏకంగా రూ.13,000 తగ్గింపును అందించారన్న మాట. దీంతోపాటు సిటీబ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు తగ్గింపు లభించనుంది. అంటే రూ.63,490కే ఈ ల్యాప్‌టాప్ కొనేయవచ్చన్న మాట.


మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.18,350 అదనపు తగ్గింపు అందించనున్నారు. అయితే అది మీ పాత ల్యాప్‌టాప్ కండీషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా.. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.  


హెచ్‌పీ 14(2021) పదో తరం ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్ ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్ హెచ్‌పీ 14s-er0503TU సిరీస్‌లో లాంచ్ అయింది. ఇంటర్నెట్ లేని చోట వినియోగదారులు తమ సిమ్ కార్డును ఇందులో వేసుకుని డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఫుల్ హెచ్‌డీ మైక్రో ఎడ్జ్, యాంటీ గ్లేర్ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ సైజు 14 అంగుళాలుగా ఉంది.


విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇంటెల్ ఐ5 10వ తరం ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని స్టోరేజ్ సామర్థ్యం 512 జీబీగా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో 3-సెల్ లిథియం ఇయాన్ బ్యాటరీని కంపెనీ అందించింది. ఇందులో రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ పోర్టు కూడా ఉన్నాయి.


హెచ్‌పీ 14(2021) పదో తరం ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి