ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ నుంచి 8 సిరీస్ (iQoo 8) ఫోన్లు రానున్నాయి. వీటిని ఆగస్టు 17వ తేదీన చైనాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన లాంచ్ పోస్టర్‌ను వీబోలో (Weibo) విడుదల చేసింది. దీని ఆధారంగా చూస్తే.. ఈ ఫోన్లలో క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్ ఉండనుంది. ఐకూ నుంచి జనవరిలో రిలీజ్ అయిన 7 (iQoo 7) మోడల్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి చైనాలో మాత్రమే విడుదల కానున్నాయి. ఇతర దేశాల మార్కెట్లోకి వీటిని విడుదల చేస్తారా? లేదా అనే విషయాలు మాత్రం తెలియరాలేదు.
ఐకూ 8 సిరీస్ ఫోన్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై రకరకాల లీకులు వస్తున్నాయి. వీటి ప్రకారం.. ఐకూ కొత్త సిరీస్‌లో ఐకూ 8, ఐకూ 8 ప్రో అనే రెండు కొత్త మోడల్స్ మార్కెట్లోకి రానున్నాయి. అలాగే వీటిలో 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. రిఫ్రెష్ రేట్ 120 Hzగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 Hzగా ఉంటుంది. వీటిలో 1,440 x 3,200 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉండనుంది. ఐకూ 8 160 సిరీస్ వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది.
ఐకూ 8 సిరీస్ ఫోన్లు 12 జీబీ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానున్నాయి. మెక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజన్ ఆపరేటింగ్ సిస్టంతో (1.0) పనిచేయనుంది. డ్యూయల్ కర్వ్‌డ్ ఎడ్జెస్ కూడా ఈ సిరీస్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో టెక్నో స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్ల పూర్తి వివరాలు
ఐకూ 7 ఫీచర్లు ఇవే..
ఐకూ 7లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. బ్యాటరీ కెపాసిటీ 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఐకూ 7 రిఫ్రెష్ రేట్ 120 Hz కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 Hzగా.. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,990 కాగా.. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.35,990గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లు స్టార్మ్ బ్లాక్, సాలిడ్ ఐస్ బ్లూ కలర్స్‌లో మార్కెట్లోకి విడుదల కానున్నాయి.
Also Read: Micromax in 2b Launch: మైక్రోమాక్స్ నుంచి కొత్త ఫోన్.. 8 వేల లోపే ధర..