ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ అందించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ ఫోన్‌లో అందించిన ర్యామ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పటివరకు వచ్చిన ఏ ఐఫోన్ ర్యామ్ వివరాలను యాపిల్ వెల్లడించలేదు. గతంలో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ (2020) కంటే ఇందులో 33 శాతం మెరుగ్గా ర్యామ్ సామర్థ్యం ఉంది. ఇందులో యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు. ర్యామ్ కూడా ఎక్కువ కాబట్టి ఈ ఫోన్ మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఐఫోన్ ఎస్ఈ (2022)లో 5జీ కనెక్టివిటీని కూడా అందించారు. వెనకవైపు కెమెరాను మెరుగుపరిచారు.
గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈలో 3 జీబీ ర్యామ్‌ను అందించగా... ఇందులో 4 జీబీ ర్యామ్‌ను అందించారు. యాపిల్ మార్చి 8వ తేదీన నిర్వహించిన ఈవెంట్‌కు సంబంధించి ఎక్స్‌కోడ్ 13.3లోని కోడ్ ద్వారా ఈ వివరాలను లీక్ చేశారు. యాపిల్ గతంలో లాంచ్ అయిన ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో కూడా 4 జీబీ ర్యామ్‌నే అందించారు. దీంతోపాటు ఐఫోన్ 13 సిరీస్‌లో అందించిన ఏ15 బయోనిక్ ప్రాసెసర్‌నే ఇందులో కూడా యాపిల్ అందించింది.
ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 6 జీబీ ర్యామ్‌ను అందించారు. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీల్లో 4 జీబీ ర్యామ్ అందించారు. సాధారణంగా యాపిల్ తన ఐఫోన్, ఐప్యాడ్ మోడళ్ల వివరాలను బయటకు తెలియజేయదు. ఐవోఎస్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టంల వివరాలను తెలియజేసే ఎక్స్‌కోడ్ అనే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఇన్విరాన్‌మెంట్‌ను (ఐడీఈ) యాపిల్ రూపొందించింది. ఇందులో ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ర్యామ్ వివరాలు కూడా ఉంటాయి.
ఐఫోన్ 8 కంటే 1.8 రెట్లు వేగంగా ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది. ఇందులో 5జీ సపోర్ట్ కూడా అందించారు. హైస్పీడ్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే బ్యాండ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. ఐఫోన్ ఎస్ఈ (2022)లో మెరుగైన కెమెరాను అందించారు. ఐఫోన్ 13లో ఉన్న కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ హెచ్‌డీఆర్ 4, ఫొటోగ్రఫిక్ స్టైల్స్, డీప్ ఫ్యూజన్, పొర్‌ట్రెయిట్ మోడ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఐఫోన్ ఎస్ఈ (2022) ఒక్కసారి చార్జ్ చేస్తే 15 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ 13 గంటల వీడియో ప్లేబ్యాక్ టైంను అందించేది. దానికంటే ఇది రెండు గంటలు ఎక్కువ కావడం విశేషం.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?