ఐఫోన్ 14 ప్రో సిరీస్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. వీటిలో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ షూటర్‌ను 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, టెలిఫొటో కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ తెలిపారు. వీటిలో 8 జీబీ వరకు ర్యామ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 లైనప్‌లో నాలుగు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మొబైల్స్ ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది.
మ్యాక్‌రూమర్స్ కథనం ప్రకారం.. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 12 మెగాపిక్సెల్ కెమెరాను మాత్రమే అందించారు. దానికంటే ఇది పెద్ద అప్‌గ్రేడ్. వీటిలో కూడా వెనకవైపు మూడేసి కెమెరాలే ఉన్నాయి.
ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌లో 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఐఫోన్ 13 ప్రో సిరీస్‌లో 6 జీబీ ర్యామ్‌ను అందించారు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లో 8 జీబీ వరకు ర్యామ్ ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ర్యామ్ కూడా 2 జీబీ వరకు పెంచనున్నారు.
ఐఫోన్ 14 మోడల్స్‌లో 120 హెర్ట్జ్ డిస్‌ప్లేలు అందించనున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 14 మోడల్స్‌లో 64 జీబీ స్టోరేజ్ మళ్లీ తీసుకురానున్నారని తెలుస్తోంది. ఐఫోన్ 13 మోడల్స్‌లో 64 జీబీ వేరియంట్‌ను అందించలేదు. 128 జీబీ నుంచే స్టోరేజ్ మొదలైంది.
ఇందులో మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ ప్రో మోడల్స్‌లో 16 అంగుళాల మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేలను అందించారు. అయితే యాపిల్ త్వరలో హోంపోడ్ మోడల్స్‌లో 3డీ సెన్సింగ్ కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!