iPad Mini 7 India Launch: యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ పేరుతో కొత్త ఐఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ సహా నాలుగు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. గత నెల రోజులుగా ప్రపంచంలోని అన్ని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ల్లో ఐఫోన్ 16 సిరీస్ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు యాపిల్ తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


మార్కెట్లోకి యాపిల్ కొత్త ప్రొడక్ట్
ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత యాపిల్ త్వరలో ఐప్యాడ్ మినీ 7ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం ఈ కొత్త ఐప్యాడ్ ఐవోఎస్ 18.1 అనౌన్స్‌మెంట్‌తో పాటు అక్టోబర్ 28వ తేదీన లాంచ్ కానుందని భావిస్తున్నారు.


అయితే దీనికి సంబంధించి యాపిల్ ఇంకా ఖచ్చితమైన తేదీని ధృవీకరించలేదు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం యాపిల్ నవంబర్ 1వ తేదీన ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఇందులో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే అవకాశం ఉంది.


ఐప్యాడ్ మినీ 7లో కొత్తగా ఏమి ఉంది?
ఐప్యాడ్ మినీ 7లో 8.3 అంగుళాల డిస్‌ప్లే, మునుపటి వెర్షన్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కొత్త ఐఫోన్ ప్యాడ్ మినీలో "జెల్లీ స్క్రోలింగ్"ను తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఐప్యాడ్ మినీ మునుపటి అప్‌డేట్‌లో ఈ సమస్య కారణంగా వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇది మాత్రమే కాకుండా యాపిల్ స్క్రోలింగ్ పనితీరును మెరుగుపరచడానికి పని చేస్తుందని తెలుస్తోంది. ఇది డిస్‌ప్లేను మరింత స్మూత్‌గా మార్చనుంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఐప్యాడ్ మినీ 7 ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్‌లలో ఉన్న శక్తివంతమైన ఎం-సిరీస్ చిప్‌ల కంటే యాపిల్ ఏ-సిరీస్ ప్రాసెసర్‌లను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇది ఐఫోన్ 15 ప్రో ఉన్న ఏ17 ప్రో చిప్... ఐఫోన్ 16లో ఉన్న కొత్త ఏ18 చిప్‌ను కలిగి ఉండవచ్చు.


ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఈ మార్పు వీడియో కాల్‌లను మరింత మెరుగ్గా చేస్తుంది. హెచ్‌డీఆర్ 4 సపోర్ట్ వంటి ఫీచర్లు కలర్ ఆక్యుసరీ, కాంట్రాస్ట్‌ను మెరుగుపరుస్తాయి. అయితే ఇందులో ఉన్న ఎపర్చర్ ఫీచర్ లో లైట్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుస్తుంది.


ధర ఎంత ఉండవచ్చు?
మీడియా నివేదికల ప్రకారం ఐప్యాడ్ మినీ 7 ప్రారంభ ధర 499 డాలర్లుగా ఉండవచ్చు. ఇది 128 జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అదే సమయంలో భారతదేశంలో దీని ధర సుమారు రూ. 45,900గా ఉండవచ్చని తెలుస్తోంది. యాపిల్ ఈ కొత్త ఐప్యాడ్ మినీని అక్టోబర్ నెలాఖరులో లాంచ్ చేస్తుందా లేదా నవంబర్ ప్రారంభంలో విడుదల చేస్తుందా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. ప్రస్తుతం ట్యాబ్లెట్లకు మనదేశంలో మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి యాపిల్ తీసుకురానున్న ఈ ట్యాబ్ మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే