ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 ల్యాప్‌టాప్ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఇప్పుడు లాంచ్‌కు ముంగిట ఈ ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. ఈ లిస్టింగ్‌లో ఈ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్లు కూడా చూడవచ్చు.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్ దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ను టీజ్ చేసింది. ఈ లిస్టింగ్‌లో ఈ ల్యాప్‌టాప్ గురించి పూర్తి వివరాలను తెలపలేదు. కానీ ఈ ల్యాప్‌టాప్ సన్నగా, తక్కువ బరువుతో రానుందని మాత్రం చెప్పవచ్చు. దీని మందం 1.63 సెంటీమీటర్లు కాగా.. బరువు 1.48 కేజీలుగా ఉండనుంది.


ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ ప్రకారం.. ఇందులో ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫినిష్ ఉండనుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 55Wh బ్యాటరీ ఉండనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 13 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. అరోరా గ్రీన్, నోబుల్ రెడ్, స్టార్ ఫాల్ గ్రే రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు.


ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో డిసెంబర్‌లో లాంచ్ కానుందని.. ఇన్‌ఫీనిక్స్ తెలిపింది. దీంతోపాటు నోట్ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్పెసిఫికేషన్లు
ఈ ల్యాప్‌టాప్ ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ స్క్రీన్ అందించనున్నారు. దీని రిజల్యూషన్ 1080పీగానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ ఉంది. 180 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను ఇందులో అందించారు.


పదో తరం ఐ3 కోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 256 జీబీ పీసీఐఈ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఇందులో ఉంది. యూహెచ్‌డీ గ్రాఫిక్స్ కూడా ఇందులో అందించారు. ఇందులో 720పీ వెబ్‌క్యాం కూడా ఉంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.


ఈ ల్యాప్‌టాప్‌లో 55Wh బ్యాటరీ ఉండనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఆడియా విషయానికి వస్తే ఇందులో 2W డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. రెండు మైక్రోఫోన్లు కూడా ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇందులో ఉంది.


Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?


Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!


Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి