Infinix GT 20 Pro: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో పేరుతో 5G ఫోన్ ను లాంచ్ చేసింది. హై ఎండ్ గేమింగ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ 5జీ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ కాగా, ఇప్పుడు భారత్ లో అడుగు పెట్టింది. 4ఎన్ఎమ్ ప్రాసెస్‌తో కూడిన మీడియాటెక్ డైమన్షిటీ 8200 అల్టిమేట్ ఎస్ఓసీని కలిగిన మొదటి ఫోన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

  


ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు  


ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో స్మార్ట్ ఫోన్ చక్కటి డిజైన్ తో పాటు అదిరిపోయే ఫీచర్లను కలిగి ఉంది. ఎల్ఈడీ ఇంటర్ ఫేస్ తో పాటు స్పెషల్ సైబర్ మెచా డిజైన్ ను కలిగి ఉంది. స్పెషల్ పిక్సెల్‌ వర్క్స్ ఎక్స్5 టర్బో డిస్‌ ‌‌ప్లే గేమింగ్ చిప్‌తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ సైబర్ మెకా డిజైన్‌తో మూడు కలర్ ఆప్షన్లలో వచ్చింది. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో 6.78 ఇంచుల 10 బిట్ ఎఫ్‌హెచ్‌డీ + అమోల్డ్ డిస్‌ప్లే తో 144hz రిఫ్రెష్ రేట్, 360 hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో ఎక్స్‌ పీరియన్స్ కోసం డివైజ్ జేబీఎల్ ట్యూన్డ్ స్పీకర్లను ఏర్పాటు చేశారు. చక్కటి గేమింగ్ అనుభూతిని పొందేలా తీర్చిదిద్దారు. ఈ స్మార్ట్ ఫోన్  45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తో కూడిన 5,000mh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ లో ఉత్పత్తి అయ్యే వేడిని తగ్గించడానికి ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని యూజ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.    


ఇన్ఫినిక్స్ జీటీ 20 ధర ఎంత అంటే?  


Infinix GT 20 Pro ధర రూ. బేస్ 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ కోసం 22,999గా కంపెనీ నిర్ణయించింది.  12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24,999గా ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మెకా బ్లూ, మెకా ఆరెంజ్, మెకా సిల్వర్ కలర్‌వేస్‌లో వస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్ మే 28 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో అమ్మకానికి వస్తుంది. ఇన్ఫినిక్స్ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కునే అవకాశం ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. గేమింగ్ ను ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్ గా ఉండబోతున్నట్లు తెలిపింది.  






Read Also: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్‌, పొరపాటున ‘డిలీట్ ఫర్‌ మీ’ కొట్టినా ఇబ్బందేమీ లేదు!