టెక్ దిగ్గజం HP దేశీయ మార్కెట్లో  ప్రీమియం ఎంటర్‌ప్రైజ్-సెంట్రిక్ ల్యాప్‌టాప్‌ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగానే Dragonfly G4 ల్యాప్‌ టాప్‌లను వినియోగదారులకు పరిచయం చేసింది.  ఈ లేటెస్ట్ ట్యాప్ టాప్ లు 1 కిలో కంటే తక్కువ బరువును కలిగి ఉండటంతో పాటు హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి ఆకర్షణీయమైన డిజైన్ తో పాటు ఇంటెల్  13 జెనరేషన్ కోర్ ప్రాసెసర్ తో వచ్చింది. ఈ ల్యాప్ టాప్ టెక్ అభిమానులను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. 


Dragonfly G4 ల్యాప్‌ టాప్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు


HP Dragonfly ఫ్లై G4 ల్యాప్ టాప్ 13వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. 32GB వరకు DDR5 RAMను కలిగి ఉంటుంది. అటు 2TB M.2 SSDను కలిగి ఉంటుంది. SSD కోసం ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ద్వారా ల్యాప్ టాప్ లోని డేటాను మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు. HP Dragonfly G4లో USB టైప్-A పోర్ట్, 2 థండర్‌బోల్ట్ 4 USB టైప్-C పోర్ట్‌ లు, హెడ్‌ఫోన్, మైక్ కాంబో జాక్, HDMI పోర్ట్,  I/O కోసం నానో SIM కార్డ్ స్లాట్ కూడా ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు మొబైల్ డేటాకు యాక్సెస్ అవసరమయ్యే వినియోగదారులకు SIM కార్డ్ స్లాట్ ఉపయోగపడుతుంది.


ఈ ల్యాప్‌టాప్‌లో 13.5-అంగుళాల WUXGA+ డిస్‌ప్లే 400 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. ఇది టచ్-ఎనేబుల్డ్ OLED ప్యానెల్ తో వస్తుంది.  HP Dragonfly G4ని మరింత పోర్టబుల్ గా లైట్ వెయిట్ తో రూపొందించింది కంపెనీ. ల్యాప్‌టాప్ తేలికైన డిజైన్‌తో ఉన్నప్పటికీ మన్నిక విషయంలో ఎలాంటి రాజీపడదని కంపెనీ వెల్లడించింది. ఈ ల్యాప్‌టాప్ Windows 11 Pro ద్వారా రన్ అవుతుంది.  పెద్ద ట్రాక్‌ ప్యాడ్‌ను కలిగి ఉంది. 68-WHr బ్యాటరీ సెల్‌ను పొందుతుంది.  5MP కెమెరాను కలిగి ఉంటుంది. 88° ఫీల్డ్-ఆఫ్-వ్యూతో వైడర్ షాట్స్ ను క్యాప్చర్ చేస్తుంది.  నాయిస్ రిమూవల్ తో చక్కటి వీడియోకాల్స్ ను పొందే అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్ 3-మీటర్ల పరిధిలోని స్పష్టమైన వాయిస్ ఇతరులకు అందజేయనుంది.    


ధర ఎంత? ఎక్కడ లభిస్తుంది?   


HP Dragonfly G4 ప్రారంభ ధరను కంపెనీ రూ. 2,20,000గా కంపెనీ నిర్ణయించింది. ఎంపిక చేసిన HP వరల్డ్ స్టోర్స్ లో మాత్రమే లభిస్తుంది. ఆన్ లైన్ లోనూ అందుబాటులో ఉంటుంది. 






Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial