Whatsapp Location Tracking: నేటి కాలంలో అందరూ ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటి. దీని ద్వారా ప్రజలు ఛాట్, కాల్స్ చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు, లొకేషన్‌ను కూడా షేర్ చేస్తారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీతో సైబర్ బెదిరింపుల భయం కూడా పెరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీ లొకేషన్‌ను వాట్సాప్ ద్వారా ట్రాక్ చేయవచ్చా? అంటే అవుననే సమాధానం వస్తుంది. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ లొకేషన్ ఇన్ఫర్మేషన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.


లొకేషన్‌ను ఎలా ట్రాక్ చేయవచ్చు?


లైవ్ లొకేషన్ షేరింగ్
వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఉంది. మీరు దీన్ని ఎవరితోనైనా షేర్ చేస్తే ఆఫ్ చేసే వరకు ఆ వ్యక్తి మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.


లింక్ ద్వారా ట్రాకింగ్
హ్యాకర్లు ఫిషింగ్ లింక్‌ల ద్వారా మీ లొకేషన్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు తెలియని లింక్‌పై క్లిక్ చేస్తే మీ లొకేషన్ ట్రాక్ అయ్యే ప్రమాదం ఉంది.


వాట్సాప్ వెబ్
మీకు తెలియకుండా ఎవరైనా మీ వాట్సాప్ ఖాతాను వాట్సాప్ వెబ్‌కి లింక్ చేస్తే వారు మీ ఛాటింగ్‌లు, లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?


అనధికార యాప్‌లు
కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించి కూడా మీ లొకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు.


దీన్ని ఎలా అడ్డుకోవాలి?


లైవ్ లొకేషన్‌ను తెలిసిన వారికి మాత్రమే షేర్ చేయండి
మీరు నమ్మే వారితో మాత్రమే లైవ్ లొకేషన్‌ను షేర్ చేయండి. మీకు అవసరం లేనప్పుడు వెంటనే దాన్ని ఆఫ్ చేయండి.


తెలియని లింక్‌లపై క్లిక్ చేయవద్దు
ఫిషింగ్, హ్యాకింగ్‌ను నివారించడానికి తెలియని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు.


వాట్సాప్ వెబ్‌పై నిఘా పెట్టండి
మీ వాట్సాప్ వెబ్ మరెక్కడా లింక్ అవ్వలేదని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. సెట్టింగ్స్‌కు వెళ్లడం ద్వారా తెలియని డివైస్‌ల్లో లాగిన్ అయితే లాగ్ అవుట్ చేసేయండి.


థర్డ్ పార్టీ యాప్‌లను నివారించండి
అధికారిక యాప్ ద్వారా మాత్రమే వాట్సాప్‌ని ఉపయోగించండి. థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దు.


సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను బలోపేతం చేయండి
2 స్టెప్ వెరిఫికేషన్‌ను ఉపయోగించండి. బలమైన పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి. 


వాట్సాప్ వంటి యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సరైన భద్రతా చర్యలను అనుసరించడం ద్వారా, మీరు మీ లొకేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఇంటర్నెట్‌ను తెలివిగా ఉపయోగించండి. మీ ప్రైవసీని మీరే జాగ్రత్తగా చూసుకోండి.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!