Whatsapp Tricks: వాట్సాప్‌లో బ్లాక్ చేసిన వారికి మెసేజ్ చేయాలా - ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీ!

వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా? వారికి కూడా ఇలా మెసేజ్ చేయవచ్చు.

Continues below advertisement

Whatsapp Tricks: ప్రస్తుతం ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో 95 శాతం మందికి పైగా వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. రోజువారీ కమ్యూనికేషన్‌కు వాట్సాప్ కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయింది. యూజర్ ఇంటర్‌ఫేస్ సింపుల్‌గా, క్లియర్‌గా ఉండటం, ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తెస్తూ ఉండటంతో వాట్సాప్ ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా మారింది. వాట్సాప్‌లో మనకు నచ్చనివారు మెసేజ్ చేస్తే... దాన్ని బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినా... మీరు వారికి మెసేజ్ చేయవచ్చు. దానికి మీరు కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

Continues below advertisement

1. వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌ను ఎంచుకోవాలి.
2. సెట్టింగ్స్‌లో డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ ఎంచుకుని దాన్ని క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అకౌంట్ డిలీట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
4. దీంతో మీ వాట్సాప్ ఖాతా డిలీట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాప్‌ను రీఇన్‌స్టాల్ చేయాలి.
5. రీఇన్‌స్టాల్ అయ్యాక అక్కడ అవసరమైన వివరాలు అందించండి.

అంతే మిమ్మల్ని ఎవరయితే బ్లాక్ చేశారో... వారందరికీ తిరిగి మెసేజ్ చేయవచ్చు. అయితే మీ ఖాతా డిలీట్ అయితే... అన్ని గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అవుతారు. దాన్ని గుర్తు పెట్టుకోండి.

అయితే ఇది కాకుండా ఇంకో ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దానికోసం మీరు మీ స్నేహితుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు, మీ స్నేహితుడికి ఇద్దరికీ ఎవరైనా కామన్ ఫ్రెండ్ ఉంటే బ్లాక్ చేసిన వ్యక్తితో, మీకు కలిపి ఒక గ్రూపు పెట్టమని అడగండి. ఆ తర్వాత గ్రూపు పెట్టిన వ్యక్తిని లీవ్ అయిపోమనండి. ఒక్కసారి తను లీవ్ అయ్యాక... మీరు అక్కడ చెప్పాలనుకుంది చెప్పవచ్చు.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

Continues below advertisement