చాలా మంది వాట్సాప్ యూజర్లు భావిస్తారు. కానీ, గ్రూప్ క్రియేట్ చేయకుండానే చాలా మందికి ఒకేసారి మెసేజ్ పంపే వీలు ఉంటుంది. బిల్ట్ ఇన్ ఫీచర్ సాయంతో సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్లకు మనం మెసేజ్ పంపుకోవచ్చు. వాట్సాప్ లోని బ్రాడ్ కాస్ట్ ఫీచర్ ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది.
ముందుగా చేయాల్సిన పనులు
1. మీ ఫోన్ నంబర్ తప్పనిసరిగా మీరు మెసేజ్ పంపించాలి అనుకుంటున్న వ్యక్తి ఫోన్ ల సేవ్ చేసి ఉండాలి.
2. మీరు ఈ మెసేజ్ ను ఎక్కువలో ఎక్కువగా 256 మందికి మాత్రమే పంపే అవకాశం ఉంటుంది.
మల్టీఫుల్ కాంటాక్ట్ లకు మెసేజ్ ఎలా పంపించాలంటే?
1. మీ ఫోన్‌లో ముందుగా WhatsAppని ఓపెన్ చేయండి.
2. వాట్సాప్ పై భాగంలో మూలన మూడు చుక్కలు కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత న్యూ బ్రాడ్ కాస్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
4. మీరు మీ మెసేజ్ పంపించాలి అనుకుంటున్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి.
5. ఆ తర్వాత మీరు మీ మెసేజ్ ను టైప్ చేసి పంపవచ్చు.
6. గ్రూపు క్రియేట్ చేయకుండానే ఒకేసారి చాలా మందికి మెసేజ్ పంపే వీలు కలుగుతుంది.
చదవని మెసేజ్ లను ఎలా మార్క్ చేయాలంటే?
వాట్సాప్ వినియోగదారులకు రోజూ చాలా మెసేజ్ లు వస్తుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. మిగతావి అంతగా ముఖ్యమైనవి కాకపోవచ్చు. ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో మెసేజ్ లు రావడం మూలంగా ముఖ్యమైన మెసేజ్ లను చూడని పరిస్థితి ఉండవచ్చు. అందుకే చూడని మెసేజ్ లకు మార్క్ పెట్టడం మూలంగా వీలున్నప్పుడు వీటిని చూసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
2. మీరు చదవనిదిగా మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేయండి.
3. వాట్సాప్ పైన కుడి మూలలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయండి.
4. చదవని మెసేజ్ లను టిక్ చేయండి. ఇలా చేయడం మూలంగా ఖాళీగా ఉన్న సమయంలో మార్క్ చేసిన మెసేజ్ లను చూసుకోవచ్చు.
మీ వాట్సాప్ లో ఏ కాంటాక్ట్ ఎక్కవ డేటా తీసుకుందో తెలుసుకోవాలంటే?
మీరు మీ వాట్సాప్ చాట్ లో ఏ కాంటాక్ట్ ఎంత డేటా తీసుకుంటుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జస్ట్ చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది. మీరు ఎవరితో ఎక్కువగా వాట్సాప్ సంభాషణ జరుపుతున్నారో.. అనే విషయం కూడా దీని ద్వారా కనుగొనే అవకాశం ఉంటుంది.
1. ముందుగా WhatsApp ఓపెన్ చేసుకోవాలి.
2. పైన కుడి మూలలో మూడు చుక్కలను నొక్కాలి.
3. సెట్టింగ్‌లను ఎంచుకోవాలి.
4. స్క్రీన్‌పై స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కండి.
5. ఆ తర్వాత స్టోరేజ్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
6. వెంటనే మీరు ఈ ప్రతి చాట్ కు సంబంధించిన డేటా వివరాలను చూసే అవకాశం ఉంటుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?