Deepfake Scammer : ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సాయంతో లేని వ్యక్తిని లేదా వస్తువును లేనిది ఉన్నట్టుగా చూపించే టెక్నాలిజీనే డీప్ ఫేక్. డీప్ లెర్నింగ్, ఫేక్ కలిపి డీప్ ఫేక్ గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో దీని ద్వారా జరిగే మోసాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. దేశంలో ఎక్కడో ఒక చోట లక్షలకు లక్షలు మోసపోతున్న, పోగొట్టుకుంటున్న కేసులు వెలుగులోకి వస్తున్నా.. ఇంకా ఎంతో మంది డీప్ ఫేక్ మోసాల బారిన పడడం గమనించాల్సిన విషయం. తాజాగా 77 ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్‌ను మోసం చేసిన ఘటన బట్టబయలైంది. ఈ క్రమంలో ఆమె  రిటైర్డ్ లెక్చరర్‌ను £17,000 అంటే భారత కరెన్సీలో రూ. 18 లక్షలకు పైగానే పోగొట్టుకుంది. ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్కాట్‌లాండ్‌లోని నిక్కీ మాక్లియోడ్ అనే బాధితురాలు.. ఓ మహిళ గిఫ్ట్ కార్డ్‌లను పంపడంతో.. ఆమె నిజమైన మహిళ అని నమ్మింది. ఆ తర్వాత ఆమె ఆన్‌లైన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తికి బ్యాంక్, పేపాల్ కు సంబంధించిన వివరాలు ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలిసింది. నిక్కీ BBC రేడియో స్కాట్‌లాండ్‌తో మాట్లాడుతూ, తనకు ఒక మహిళ డీప్‌ఫేక్ వీడియోలు పంపిందని, అవతలి వైపు ఉన్న వ్యక్తి 'అల్లా మోర్గాన్' అని తనకు పూర్తిగా నమ్మకం కలిగిందని, అతను తనను స్కామ్ చేయదని చెప్పింది.


లాక్‌డౌన్ సమయంలో తన తల్లిదండ్రులను కోల్పోయానని, ఆమె తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో వ్యక్తులతో మాట్లాడటం ప్రారంభించినట్టు నిక్కీ చెప్పారు. అక్కడ ఒక చాట్ గ్రూప్‌లో 'అల్లా మోర్గాన్'ని కలుసుకుంది. ఆ వ్యక్తి ఆయిల్ రిగ్ లో పని చేస్తున్నారని, అందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా చూపించి నిక్కీని నమ్మించింది. వీడియో కాల్స్ చేసినప్పటికీ నిక్కీ రిజెక్ట్ చేయడంతో తనకు కొన్ని వీడియో మెసేజెస్ పంపిందని నిక్కీ తెలిపింది. 


నమ్మి డబ్బులు పంపడంతో మోసం


తాను స్కామర్ ను కాదని, ఆయిల్ రిగ్ లో ఉన్నానని వీడియోలో చెప్పడంతో నిక్కీ ఆలోచనలో పడింది. ఆమె నిజమైన వ్యక్తేనా అని ఆలోచించసాగింది. కొన్ని వారాల తర్వాత ఆమె తనకు మరొక వీడియో వచ్చిందని, అందులో 2500 డాలర్లు పంపమని కోరినట్టు నిక్కీ చెప్పింది. దాన్నంతటినీ నమ్మిన నిక్కీ తన అకౌంట్ నుంచి డబ్బులు పంపింది. అలా స్కామర్ కు మొత్తం £17,000 పంపినట్లు తెలిపింది. అల్లా మోర్గాన్ ఇప్పుడు టర్కిష్ జైలులో ఉందని, మరింత డబ్బు అవసరమని పేర్కొంటూ స్కామర్‌లు తనను సంప్రదించడం కొనసాగిస్తున్నారని, ఇటీవల తనకు వార్తాపత్రిక కథనాన్ని పంపినట్టు నిక్కీ చెప్పింది. తన అనుభవం నుండి ఇతరులు నేర్చుకోవాలని ప్రస్తుతం ఆమె కోరుకుంటోంది. "ఈ స్కామర్‌లకు అస్సలు సానుభూతి ఉండదు. వారి పనే ఇది. వారు చాలా మంచివారుగా నటిస్తారు" అని ఆమె చెప్పింది. ‘‘డాక్యుమెంట్లు, వీడియోలు నిజమని, బ్యాంకు వివరాలు అన్నీ నిజమనిపించేలా ఉంటాయి. కృత్రిమ మేధస్సు వల్ల ప్రతి వస్తువు ఫేక్ అవుతుంది" అని వివరించింది.


పొడవాటి గోధుమ రంగు జుట్టు, బూడిద రంగు హుడ్ జంపర్ ధరించి ఉన్నట్లుగా కనిపించే అల్లా మోర్గాన్ అని చెప్పుకునే మహిళ AI- రూపొందించిన వీడియోను నిక్కీ BBC స్కాట్లాండ్‌తో పంచుకుంది. మహిళ చిత్రం మూలం ఇప్పుడు తెలిసిందని, ఆమె నిజమైన మహిళగా నటించి స్కామ్‌లో భాగమైందని ఓ నివేదిక పేర్కొంది. అయితే నిక్కీ పంపిన £17,000లలో £7,000 తిరిగి పొందగలిగింది.


డీప్‌ఫేక్ వీడియో స్కామ్‌ను ఎలా గుర్తించాలి..?


నిక్కి పంపిన వీడియో సందేశాలను పరిశీలించమని అబెర్టే విశ్వవిద్యాలయంలో సైబర్‌ సెక్యూరిటీ అండ్ హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్‌లో ఎక్స్ పర్ట్ డాక్టర్ లిన్సే షెపర్డ్‌ను BBC స్కాట్లాండ్ కోరింది. "మొదటి చూపులో ఇది చట్టబద్ధంగా కనిపిస్తుంది. మీకు దీని గురించి తెలియకపోతే వారి కళ్ళను చూడండి. అందులో వారి కంటి కదలికలు సరిగ్గా ఉండవు. దీనికి సంబంధించి ఇప్పుడు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫేస్ స్వాప్ యాప్ లేదా ఫిల్టర్‌ల వంటి సాధారణమైనవి కూడా వీటిని చేయగలవు. మీరు కొన్నిసార్లు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు, దవడ చుట్టూ చూసినప్పుడు ఈ తేడా కనిపిస్తుంది.


Also Read : Amazon: అమెజాన్ సబ్ స్క్రైబర్లకు బ్యాడ్ న్యూస్... పాస్ వర్డ్ షేరింగ్ రూల్స్ మారుతున్నాయ్