Password sharing rules of Amazon Prime Video OTT: పాస్ట్ వర్డ్ షేరింగ్... ఓటీటీ సంస్థలకు తలనొప్పిగా మారిన వ్యవహారం. కుటుంబంలో ఒకరు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారు. ఇంటిల్లి పాదీ అదే అకౌంట్ వినియోగిస్తూ ఉంటారు. ఈ కారణంగా ఓటీటీ సంస్థల సబ్ స్క్రిప్షన్లు కొనే వారి సంఖ్య బాగా తగ్గింది. దీంతో పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో పరిమితులు విధిస్తున్నాయి ఓటీటీలు. అయితే, మిగతా ఓటీటీలతో పోలిస్తే, పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో కాస్త ఉదారంగా ఉన్నది కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియోనే. ఇప్పటివరకూ ఈ విషయంలో కాస్త చూసి చూడనట్టుగా వ్యవహరించింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో ఈ ఏడాదే కఠినమైన రూల్స్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ కూడా పాస్ వర్డ్ షేరింగ్ విషయంలో కొత్త రూల్స్ వర్తిస్తాయని పేర్కొంది. వచ్చే 2025 జనవరి ఇవి అమలు కానున్నాయి.


ఇక రెండిటికే ఛాన్స్


అమెజాన్ ప్రైమ్ లో నెలకు 299 రూపాయాలకు, మూడు నెలలకు 599 రూపాయలు, ఏడాదికి 1499 రూపాయల చొప్పున సబ్ స్క్రిప్షన్లను ఎంచుకోవాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటైనా కొనుగోలు చేస్తే, స్మార్ట్ ఫోన్లు , ట్యాబ్లెట్లు అనే తేడా లేకుండా ఇప్పటివరకూ 10 డివైస్ లలో అమెజాన్ వెబ్ సిరీస్ లు, సినిమాలు చూసే అవకాశం ఉండేది. రాను రాను సబ్ స్క్రైబ్ చేసుకునే వారి సంఖ్య తగ్గుతోందని అమెజాన్ ప్రైమ్ గమనించింది. అందుకే కేవలం ఐదు డివైజెస్ లకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియోను రిజిస్టర్ చేసుకునే అవకాశం పరిమితం చేయనుంది. అంతే కాదు, ఐదు డివైజెస్ లో కేవలం రెండు టీవీ డివైస్ ల్లో మాత్రమే ఒకే సారి ఈ ఓటీటీని వినియోగించుకోవచ్చు.


నెల రోజులే టైం


ఈ కొత్త రూల్స్ అన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు కానున్నాయి. ఇప్పటికే అమెజాన్ మెంబర్ షిప్ ఉన్న వాళ్లు చేయాల్సిన పని ఒకటే. అమెజాన్ యాప్ లోని సెట్టింగ్స్ క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ డివైసెస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు కావాల్సిన వాటిని రిజిస్టర్ చేయండి. అక్కర్లేని డివైసెస్ ను డీ రిజిస్టర్ చేసేయండి. ఈ నెల రోజుల లోపు సెట్టింగ్స్ మార్చుకోవాలి.


Also Read: రోడ్ షో చేయలేదు... పోలీసులు నా దగ్గరకొచ్చి చెప్పలేదు... నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్


ఎప్పుడో మేల్కోన్న నెట్ ఫ్లిక్స్


ఒకే వైఫై యాక్సెస్, ఒకే లొకేషన్ లో ఉండే వారిని ఒక హౌస్ హోల్డ్ గా తమ సబ్ స్క్రైబర్ల ను వర్గీకరించింది. ఎవరైనా వేరే లొకేషన్ నుంచి ఒక అకౌంట్ ను యాక్సెస్ చేయాలంటే , సదరు అకౌంట్ హోల్డర్ అనుమతి తప్పక ఉండాల్సిందే. వారు యాక్సెస్ కోడ్ చెబితే, వేరే లొకేషన్ లో ఉన్నవాళ్లు అకౌంట్ లోకి లాగిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు కూడా నెట్ ఫ్లిక్స్ ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే. త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ కూడా పాస్ వర్డ్ షేరింగ్ పై నిబంధనలు విధించనుందనే టాక్ నడుస్తోంది.


Also Readటాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్