ఇయర్ ఎండ్ హడావిడి మొదలైపోయింది. మరో 10 రోజుల్లో 2024ను పూర్తి చేసి, కొత్త ఏడాది 2025లోకి అడుగు పెట్టబోతున్నాము. ఇప్పటి నుంచే న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్ల గురించి చర్చలు మొదలయ్యాయి. కానీ సినిమా పిచ్చోళ్ళు మాత్రం ఈ ఇయర్ ఎండ్ లో ఎలాంటి సినిమాలను చూడాలి? కొత్త ఏడాది రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటి? అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి క్రేజీ మూవీ లవర్స్ కోసమే దర్శకనిర్మాతలు ఓటీటీలో గ్రిప్పింగ్ థ్రిల్లర్ల నుంచి ఎమోషనల్ డ్రామాల వరకు 2025లో కొన్ని మోస్ట్ అవైటింగ్ సిరీస్ లను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
రక్త్ బ్రహ్మాండ్
రాజ్ & డీకే నిర్మించిన యాక్షన్-ప్యాక్డ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్'లో ఆదిత్య రాయ్ కపూర్, సమంతా రూత్ ప్రభు , అలీ ఫజల్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ మోస్ట్ అవైటింగ్ సిరీస్ 2025 చివరలో నెట్‌ఫ్లిక్స్ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఫ్యామిలి మ్యాన్ సీజన్ 3
మనోజ్ బాజ్‌పేయి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సిరీస్ 'ఫ్యామిలి మ్యాన్ సీజన్ 3'. రాజ్ & డికె దర్శకత్వం వహించిన ఈ క్రేజీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే ఏడాది ప్రీమియర్ అవుతుంది.
డేరింగ్ పార్ట్‌నర్స్
డయానా పెంటీ, తమన్నా భాటియా నటించిన ఒక లైట్‌హార్టెడ్ రోమ్-కామ్ 'డేరింగ్ పార్ట్‌నర్స్'. అర్చిత్ కుమార్ - నిశాంత్ నాయక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
జ్యువెల్ థీఫ్
సైఫ్ అలీ ఖాన్, నికితా దత్తా, జైదీప్ అహ్లావత్ కలిసి నటించిన హీస్ట్ థ్రిల్లర్ 'జ్యువెల్ థీఫ్'. రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించారు. ఈ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ను ఇస్తుంది.
డబ్బా కార్టెల్
షబానా అజ్మీ, షాలినీ పాండే , జిషు సేన్‌గుప్తా, గజరాజ్ రావు, జ్యోతిక నటించిన థ్రిల్లర్ సిరీస్ 'డబ్బా కార్టెల్'. హితేష్ భాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మించారు. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది.
బ్యాండ్‌వాలే
షాలిని పాండే, జహాన్ కపూర్, స్వానంద్ కిర్కిరే, సంజన దీపు ప్రధాన పాత్రలు పోషించిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ షో 'బ్యాండ్‌వాలే'. అక్షత్ వర్మ, అంకుర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ షో ఒక ఫ్యామిలీ అండ్ క్రైమ్ డ్రామా.
ట్రయల్స్ సీజన్ 2
కాజోల్, కుబ్రా సాయిత్ మెయిన్ లీడ్స్ గా నటించిన సిరీస్ 'ట్రయల్స్ 2'. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
Also Read: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
స్టార్‌డమ్
స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'స్టార్‌డమ్'లో షారూఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, బాబీ డియోల్, బాద్షా ప్రధాన పాత్రల్లో నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది.
ప్రీతమ్ పెడ్రో
ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో విక్రాంత్ మస్సే, అర్షద్ వార్సి కలిసి నటించారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది.
మట్కా కింగ్
నాగరాజ్ మంజులే దర్శకత్వం వహించిన 'మట్కా కింగ్' అనే ఈ సిరీస్ లో విజయ్ వర్మ లీడ్ రోల్ లో నటించారు. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ 1960 లలో మట్కా జూదం ఎలా రాజ్యమేలిందో తెలుపుతుంది.
Read Also : Best Christmas Movies : క్రిస్మస్ను మరింత స్పెషల్‌గా చేసే బెస్ట్ మూవీస్... ఏ ఓటీటీలో ఉన్నాయో తెలుసా?