Hotmail Co Founder Sabeer Bhatia | ఆధార్ కోసం చేసిన 1.3 బిలియన్ల ఖర్చును వృథా అని హాట్‌మెయిల్ కో-ఫౌండర్ సబీర్ భాటియా అన్నారు.  ఇటీవల విడుదల చేసిన పాడ్‌కాస్ట్‌లో సబీర్ భాటియా ఆధార్ సహా టెక్నాలజీ అంశాలపై కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రఖార్ గుప్తా హోస్ట్ చేసిన ప్రఖార్ కే ప్రవాచన్ అనే పాడ్‌కాస్ట్ సిరీస్ ఎపిసోడ్‌లో సబీర్ భాటియా పాల్గొన్నారు. పాడ్‌కాస్ట్ హోస్ట్ UPI గురించి,  విదేశాలలో ఉన్న దీనికి ప్రత్యామ్నాయంపై సబీర్ భాటియాను కొన్ని ప్రశ్నలు అడిగారు. విదేశాలలో యూపీఐ (UPI) సేవలు అందుబాటులోకి రావడం, పలు దేశాలలో ఇది వారికి ప్రేరణ పొందడానికి పనికొస్తుందా అని భాటియాను యాంకర్ అడిగారు. 


ప్రత్యేక గుర్తింపు కోసం అంత ఖర్చు వేస్ట్!


సబీర్ భాటియా మాట్లాడుతూ.. UPI అంటే వెన్మో తప్ప మరేమీ కాదన్నారు. ఆధార్ వ్యవస్థ కోసం 1.3  బిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఇదంతా వృథా అని అభిప్రాయపడ్డారు. యూనిక్ ఐడెంటిటీ కోసం కేవలం 20 మిలియన్ల డాలర్లతో ప్రత్యేక వ్యవస్థ రూపొందించి ఉండొచ్చు అన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఆధార్ కు ప్రత్యామ్నాయంగా వేరే ఏదైనా కొత్త ఐడెంటిటీ టెక్నాలజీ రూపొందించి ఉండొచ్చు అన్నారు. ఆధార్ కోసం మీ బయోమెట్రిక్‌లను తీసుకున్నారు. ఇంతకీ అది ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది ప్రశ్నగా మిగిలింది. ఎవరైనా వ్యక్తుల ప్రత్యేక గుర్తింపు (Unique identification) సమస్యను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫోన్ ద్వారా వాయిస్ ప్రింటింగ్, వీడియో ప్రింటింగ్ చేస్తే సరి. దీనికి కేవలం 20 మిలియన్ డాలర్లు సరిపోతాయన్నారు సబీర్ భాటియా. 


వాయిస్ ప్రింట్ ద్వారా బయోమెట్రిక్స్‌ను రీప్లేస్ చేయవచ్చా?
బయోమెట్రిక్ అనేది నేడు సాధారణం అయిపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులతో పాటు విద్యా సంస్థల్లోనూ బయోమెట్రిక్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. ఇది చేసిన వారు అంత టెక్నికల్ పర్సన్ కాదు. కోడింగ్ ఐడియా లేని వారు, ఇలాంటి విధానాలతో వస్తారు. టెక్నాలజీని ఎక్కడ, ఏ విధంగా, దేని కోసం వాడాలో నాకు బాగా తెలుసు. ఆవిష్కరణ ఎలా ఉండాలంటే, 'మేరా నామ్ సబీర్ భాటియా హై ఔర్ మైన్ ఈజ్ జాగే కా రెహ్నేవాలా హూన్' (నా పేరు సబీర్ భాటియా, నేను ఈ ప్రాంత వాసిని) అనే విధంగా ప్రతిఒక్క భారత పౌరుడి వాయిస్ ప్రింట్ తీసుకుంటే ఇన్నోవేషన్‌గా భావిస్తానని’ ఆయన చెప్పుకొచ్చారు.



‘మన గొంతు (Voice) అనేది భిన్నంగా ఉంటుంది. మన వీడియోలు సైతం యూనిక్‌గా ఉంటాయి. వాటిని  డేటాబేస్‌లో సేవ్ చేసి ఉంచితే.. విమానాశ్రయంలో వాయిస్ ప్రింట్, వీడియో ప్రింట్ ద్వారా వారిని గుర్తించడానికి ఉపయోగించే స్పెషల్ ఐడెంటిఫైయర్ అవుతుంది. ఎవరైనా ఎయిర్‌పోర్టులోకి రాగానే లోపలికి నడుస్తున్న వీడియోలతో, అబ్బాయిలు మీ కార్డును తనిఖీ చేయాల్సిన అవసరం సైతం ఉండదు. అది నేరుగా 'స్వాగతం మిస్టర్ ప్రఖర్, మీరు మాకు  తెలుసు, మీరు ఇప్పటికే చెక్ అయ్యారు' అని ఆ ఐడెంటిఫయర్ చెబుతుంది. దీన్ని టెక్నాలజీగా భావిస్తాను. ఇలాంటి వాటిని అతి చౌకగా రూపొందించవచ్చు’ అని హాట్ మెయిల్ కో ఫౌండర్ సబీర్ భాటియా ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.


Also Read: Mars Exploration: మార్స్‌పై ఆ గుర్తులేంటి...? ఏలియన్స్ ఉన్నారనడానికి సంకేతమా.. ? దాని సంగతేంటో చూడాలంటున్న Elon Musk