విశ్వాంతరాల అన్వేషణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకొస్తూనే ఉంటాయి. ఈ మధ్య బయటకొచ్చిన ఓ సంగతి అంతరిక్ష అన్వేషకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఏంటా విషయం అంటే.. మార్స్ మీద చతురాస్రాకారంలో ఉన్న ఓ గుర్తును గుర్తించారు. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తును NASA కు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ (MOC) ఫోటోలు తీసింది. ఆ గుర్తును చూసినప్పటి నుంచి స్పేస్ అన్వేషకులు ( Space Enthusiasts) నుంచి సామాన్యుల వరకూ వారి వారి కోణంలో థియరీలు చెబుతున్నారు. అయితే స్పేస్ థియరీలపై, అంతరిక్ష కార్యక్రమాలపైనా విపరీతమైన ఆసక్తిని చూపించే గ్లోబల్ డ్రీమర్, Space CEO ఎలాన్ మస్క్- Elon Musk కూడా దీనిపై స్పందించాడు. ఆ గుర్తుల గుట్టేంటో బయట పెట్టాలంటున్నాడు. మస్క్ సంగతి తెలిసిందే కదా.. కేవలం తన ఆసక్తి మేరకే స్పేస్ ప్రోగ్రామ్స్‌లో వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దీనిపై కన్నేశాడు అంటే దాని సంగతేంటో చూడాలి అనుకుంటున్నట్లు అర్థం.

ఇంతకీ ఆ గర్తులేంటి..?
గ్రహాల మీద రకరకాల వైవిధ్యాలు ఉండటం సహజమే. భూమి మీద కూడా అలాంటివి చాలా ఉన్నాయి. భూమికి చాలా దగ్గర సారూప్యతలు ఉన్న మార్స్ మీద కూడా ఈ మార్పులు ఉండటానికి అవకాశం ఉంది. అలాగే షుమారు 1.8 మైళ్ల వెడల్పు ( మూడు కిలోమీటర్లు) తో మార్స్ మీద ఆ రకమైన గుర్తులు ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఎక్కువ మందిని ఆశ్చర్యపరుస్తోంది ఏంటంటే ఆ ఫార్మేషన్స్ అంత పర్ఫెక్ట్ స్క్వేర్ గా ఉండటమే. అసలు అవి నేచరల్ ప్లానేటరీ ఫార్మేషనా లేక ఏదైనా అదృశ్య శక్తుల పనా అన్నది ఎక్కువ మంది డౌట్. అందుకే అరుణ గ్రహంపై మరింత అన్వేషణ జరగాలన్న ఆలోచనలు పెరుగుతున్నాయి.
ఈ ఫోటోలు ఎలా వచ్చాయి...?
ఈ ఫోటోలు గురించి సైంటిఫిక్ సర్కిల్స్‌లో ఇంత చర్చ జరుగుతోంది కానీ ఈ ఫోటోలు ఇప్పటివి కాదు. ఈ ఫోటోలను NASA కు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ (MOC) ఫోటోలు తీసింది. ఈ ఆర్బిటర్ 1997 నుంచి 2006 వరకూ మార్స్ మాపింగ్ చేసింది. 2006లోనే ఈ ఆర్బిటర్‌ను డీకమిషన్ చేసినప్పటికీ దాని డేటా ను మాత్రం చాలా కాలంగా విశ్లేషిస్తున్నారు. అలా పాత ఫోటోల్లో ఈ స్క్వేర్ ఫార్మేషన్ కనిపించింది. Arizona State University కి చెందిన స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఈ ఫోటోను ప్రచురించింది. ఆ తర్వాత అది Reddit కమ్యూనిటీలోకి వచ్చేసింది.
ఎలన్ మస్క్ ఆసక్తి
ఈ ఫోటోలు ఇంటర్నెట్ సెంటిఫిక్ కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వడం మొదలుపెట్టాయి. నెటిజన్స్ అంతా రకరకాల థియరీలు ఇవ్వడం మొదలు పెట్టారు. Chris Ramsay అనే ఓ అకౌంట్ ను ప్రఖ్యాత పాడ్ కాస్టర్ Joe Roagn రీ ట్వీట్ చేశారు. దానిపై ఎలన్ మస్క్ స్పందించారు. “ We Should send astronauts to Mars to Invetigate’’ అని మస్క్ స్పందించిన విధానం చూస్తే ఆయన దాని మీద ఇంట్రస్ట్ గా ఉందీ అర్థమవుతోంది. మార్స్ పై హ్యూమన్ కాలనీలు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో Elon Musk కలలుగంటున్నాడు. మరో పదేళ్లలో తన Space X ద్వారా మార్స్ మీదకు మనుషులను పంపే పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ తాజా గుర్తులు ఆ పనులను మరింత వేగం చేయొచ్చు.
ఏలియన్స్ ఉన్నారా...?
ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువ మంది దృష్టి సారిస్తోంది ఏలియన్స్ పైన. దానికి కారణం ఉంది. ఈ ఫోటోలు వచ్చినప్పటి నుంచి ఇంటర్‌నెట్ సైంటిఫిక్ కమ్యూనిటీ రకరకాల థియరీలు ఇస్తోంది. గ్రహాలపై జరిగే జియోలాజికల్ మార్పుల వల్లే ఈ ఫార్మేషన్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. ఇది రాళ్లు.. కొండలు ఉన్న ప్రాంతంలో ఏర్పడటంతో టెక్టానిక్ యాక్టివిటీ వల్ల కానీ… లేదా ఏరోజన్ వల్ల ఇది ఏర్పడి ఉండొచ్చని వాళ్లు చెబుతున్నారు. భూమి మీద Volcanic Explosion ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి గుర్తులు ఉన్నాయి. కొంతమంది ఇవి భూమి మీద ఉన్న పిరమిడ్స్ వంటి స్ట్రక్చర్స్ అయి ఉండొచ్చు అని భావిస్తున్నారు. కానీ కొంతమంది డౌట్ ఏంటంటే నేచరల్ ఫార్మేషన్ అయితే అంత పర్‌ఫెక్ట్ గా జ్రామెట్రికల్ యాంగిల్స్ తో సహా.. పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఏర్పడిందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. నేచరల్ జియాలజికల్ ఫార్మేషన్స్ లో అలా జరిగేందుకు అవకాశం లేదు. అందుకే ఈ స్క్వేర్ ఇప్పుడు అంత ఆసక్తి రేపుతోంది. ఇదేదో కృత్రిమంగా ఏర్పాటు చేసిన ఆకృతిలా కనిపిస్తోందని నమ్మే వారున్నారు. స్క్వేర్ ను మనుషులు కనిపెట్టారు. ఇప్పటి వరకూ మనుషులు మార్స్ మీదకు అడుగుపెట్టలేదు. కానీ పర్ఫెక్ట్ స్కేర్‌తో ఒక ఫార్మేషన్ ఉందంటే మనలాంటి జీవులు ఎవరో అక్కడ బేస్ ఏర్పాటు చేశారని నమ్మేవాళ్లున్నారు. Aleines కావొచ్చా..? Elon Musk దానిని ఇన్వెస్టిగేట్ చేయాలంటున్నారంటే అర్థం అదే. మనకు తెలియని గ్రహాంతరవాసులు విశ్వంలో ఉండి ఉండొచ్చన్న ఓ థియరీ ఉంది. ఇది కనుక కృత్రిమంగా ఏర్పడిందని రుజువు చేస్తే.. ఆ థియరీకి అసలైన ప్రూఫ్ దొరికినట్లే.
Also Read: ఏలియన్స్ ఉన్నట్లుగా మరో సాక్ష్యం ? నాసా కొత్త ఫోటో చూస్తే అలాగే అనిపిస్తుంది మరి
తర్వాత ఏం జరుగుతుంది...?
మార్స్ పై ఇది కచ్చితంగా ఎక్కడ జరిగిందనేది తెలుసు. కాబట్టి ఆ ప్రాంతాన్ని మరింత అన్వేషించాలి. నాసా ఇప్పటికే Mars Reconnaissance Orbiter (MRO), మిషన్ ను నిర్వహిస్తోంది. దీనికి హై రైజ్ కెమెరాలు ఉంటాయి. వీటితో ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత లోతుగా విశ్లేషించొచ్చు. ఈ ఫార్మేషన్ ఉన్న ప్రదేశంలో స్ట్రక్చర్స్ ఉన్నాయా లేదా సహజంగా ఏర్పడిందా.. అక్కడ జియాలాజికల్ కండిషన్లు ఏంటన్నది చూడొచ్చు. అలాగే త్వరలో చంద్రుడిపైన ఓ బేస్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మార్స్ మిషన్లు ఆపరేట్ చేయాలని నాసా అనుకుంటోంది. ఇది కార్యరూపం దాల్చితే కొంత క్లారిటీ రావొచ్చు. అలాగే పలు రోవర్ మిషన్లను కూడా నాసా చేపట్టింది. రోవర్ ద్వారా మార్స్ పై ఉన్న నమూనాలను ఫిజికల్ గా పరిశీలించే అవకాశం కూడా కలుగుతుంది. నేరుగా ఈ ప్రదేశం వైపుకు రోవర్ ను పంపించడం ద్వారా Robotic Exploration చేయొచ్చు. ఏమో దీనిపై ఇంత ఆసక్తి చూపుతున్న Elon Musk కూడా ఏదైనా చేయొచ్చు. ఇప్పటికే Star Line పేరుతో మస్క్ కంపెనీ Space X డీప్ స్పేస్ మిషన్లు చేపట్టింది. మరో పదేళ్లలో మార్స్‌పైకి మనుషులను పంపేందుకు కూడా మస్క్ ప్రయత్నిస్తున్నారు. వాళ్లు కూడా ఏదైనా చేయొచ్చు.