Sumanth First Look Released From Anaganaga Movie: టాలీవుడ్ హీరో సుమంత్ (Sumanth) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా మూవీ 'అనగనగా'. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాం 'ఈటీవీ విన్'లో విడుదల కానుంది. సన్నీకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. 'ఈటీవి విన్'తో కలిసి కృషి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల కాగా ఆకట్టుకుంటోంది. సుమంత్ ఈ సినిమాలో స్కూల్ టీచర్‌గా కనిపించబోతున్నారు. 'అనగనగా..' అంటూ చిన్నారులకు కథ చెబుతున్న గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. కాగా, సుమంత్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆదివారం ఈ సినిమా నుంచి ఆయన లుక్‌ను రిలీజ్ చేశారు. 'చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా?. అవే కథలు మళ్లీ నెమరు వేయటానికి వస్తున్న మన వ్యాస్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు!' అంటూ పేర్కొన్నారు. 

Also Read: విజయ్ దేవరకొండ కోసం జూనియర్ ఎన్టీఆర్ - 'VD 12' టీజర్‌కు వాయిస్ ఓవర్, ఆ భాషల్లో అగ్రహీరోలు కూడా..

స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో..

'అనగనగా..' సినిమా స్కూల్ బ్యాక్ డ్రాప్‌ కథాంశంగా తెరకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. పల్లెటూరి వాతావరణంలో స్కూల్ టీచర్‌గా తన భార్య, పిల్లాడితో కలిసి బండిపై వెళ్తున్నట్లుగా ఉన్న సుమంత్ ఫస్ట్ లుక్ వ్యాస్ 'సార్'గా ఆకట్టుకుంటోంది. అటు, సన్నీ సంజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఈ మూవీతోనే ఆయన టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ రాణి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీతోనే ఆమె కూడా టాలీవుడ్‌లో తొలి అడుగు వేయబోతోంది. మిస్ యూనివర్స్ బీహార్ 2024గా కాజల్ రాణి ఎంపికయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ విహర్ష్ కీలక పాత్రలో పోషిస్తున్నాడు.

సుమంత్ సుదీర్ఘ కెరీర్‌లో..

సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కొత్త కథలతో హీరో సుమంత్ ప్రయోగాలు చేస్తుంటారు. ఆయన టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి దాదాపు 23 ఏళ్లయింది. కెరీర్ ప్రారంభంలోనే విభిన్న కదాంశంతో గోదావరి, గోల్కొండ హైస్కూల్, సత్యం వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ అంతటి విజయాలను చూడలేదు. మళ్లీ 2017లో 'మళ్లీ రావా'తో హిట్ కొట్టారు. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు అడపాదడపా అతిథి పాత్రల్లో నటించారు. చివరిగా గతేడాది 'అహం రీబూట్' సినిమాతో వచ్చినా అనుకున్నంత విజయం సాధించలేదు. 

ప్రస్తుతం సుమంత్ మహేంద్రగిరి వారాహి పేరుతో ఓ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తుండగా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో ఇదే దర్శకుడితో సుమంత్ 'సుబ్రహ్మణ్యపురం' సినిమా తీయగా అది అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Also Read: 'అల్లు అర్జున్ SVR లాంటి వారు' - మీరు ట్రోల్ చేసినా ఇది నిజం అంటూ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్