Junior NTR Voice Over For VD 12 Telugu Title Teaser: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి కాంబోలో స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'VD 12' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. సినిమా టైటిల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. ఇటీవలే నిర్మాత నాగవంశీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 12న సినిమా టైటిల్ అండ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'ప్రపంచాన్ని ఉత్కంఠబరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం.' అంటూ ఓ పోస్టర్ షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు స్పందించిన హీరో విజయ్ దేవరకొండ.. 'మీరందరూ ఓపిక పట్టారు. మీ కఠినమైన ప్రేమను మేము చూశాం. మేము ఇప్పుడు మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టైటిల్, టీజర్‌తో మీరంతా గర్వపడతారు.' అని పేర్కొన్నారు.






Also Read: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్


జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్


ఈ చిత్రానికి 'సామ్రాజ్యం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ టీజర్‌కు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య (Surya) వాయిస్ ఓవర్ అందించబోతున్నారని తెలుస్తోంది. నిర్మాత నాగవంశీతో ఎన్టీఆర్‌‌కు మంచి అనుబంధం ఉంది. ఆయన రిక్వెస్ట్‌తోనే ఎన్టీఆర్ ఇందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన వాయిస్‌తో మూవీ టీజర్ వేరే లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం 'VD12' మూవీ చిత్రీకరణ ముగింప దశలో ఉండగా.. మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.


కాగా, 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో హీరో నానికి ఫ్రెండ్‌ రోల్‌లో నటించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోనూ మెరిశారు. ఆ తర్వాత పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయారు. అనంతరం వచ్చిన గీత గోవిందం, లైగర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో విజయ్ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఓ మంచి కథాంశంతో ముందుకొస్తున్నట్లు సమాచారం.


Also Read: ఓటీటీలోకి 'ముఫాసా: ది లయన్ కింగ్' - ఆ ప్లాట్ ఫామ్‌లో చూసి ఎంజాయ్ చేయండి, ఎప్పటి నుంచంటే?