Honor X60i Launched: హానర్ ఎక్స్60ఐ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఐపీ64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందా లేదా అన్న విషయం ఇంకా తెలియరాలేదు.


హానర్ ఎక్స్60ఐ ధర (Honor X60i Price)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.16,100) నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.18,400), 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799 యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.20,700) ఉంది. క్లౌడ్ బ్లూ, కోరల్ పర్పుల్, మ్యాజిక్ నైట్ బ్లాక్, మూన్ షాడో వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మోబైల్స్ ఇవే


హానర్ ఎక్స్60ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Honor X60i Specifications)
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ స్క్రీన్ అందుబాటులో ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై హానర్ ఎక్స్60ఐ రన్ కానుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌ను కూడా ఫోన్ వెనకవైపు చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.


దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 35W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ 5జీ, డ్యూయల్ 4జీ, వైఫై, ఓటీజీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, గెలీలియో, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ కూడా ఇందులో ఉన్నాయి. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు. దీని మందం 0.71 సెంటీమీటర్లు కాగా, బరువు 172  గ్రాములుగా ఉంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉంది.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?