Honor 60 Pro: హానర్ 60 ప్రో వచ్చేసింది.. రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు.. 108 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా.. ధర ఎంతంటే?

హానర్ తన కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 60 ప్రోను లాంచ్ చేసింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్ అందించారు.

Continues below advertisement

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త స్మార్ట్ ఫోన్ 60 ప్రోను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్, 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. అదిరిపోయే ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ రేంజ్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది.

Continues below advertisement

హానర్ 60 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 2,699 యువాన్లుగా(సుమారు రూ.43,500) ఉండగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా (రూ.47,000) నిర్ణయించారు. ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హానర్ 60 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత మ్యాజిక్ యూఐ 5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను హానర్ అందించింది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. డీసీఐ-పీ3 వైడ్ కలర్ గాముట్ ఫీచర్ ఇందులో అందించారు. హానర్ 60లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉండగా.. ఇందులో మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను అందించలేదు.

హానర్ 60లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కెమెరాగా ఉంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.

ఇందులో వ్లాగర్ల కోసం ఏఐ పవర్డ్ వీడియో ఫీచర్లు అందించారు. హానర్ 60 తరహాలోనే దీని బ్యాటరీ సామర్థ్యం కూడా 4800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2, వైఫై 6 కనెక్టివిటీ, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement