Google Call Switching feature: యాపిల్ ఐఫోన్‌లో ఎన్నో సంవత్సరాల నుంచి అందుబాటులో ఉన్న ఫీచర్లు కూడా మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల్లో పొందలేరు. యాపిల్ డివైసెస్ ఒకదానితో ఒకటి సులభంగా కనెక్ట్ అవుతాయి. యాపిల్ వినియోగదారులు డయల్ చేయడం లేదా కాల్‌లను అటెంప్ట్ చేయడం, ఫైల్‌లను షేర్ చేయడం, యాప్స్ ఉపయోగించడం వంటి వివిధ పనుల కోసం వారి iPhone, iPad, Mac డివైస్‌ల మధ్య సులభంగా స్విచ్ అవ్వవచ్చు. అయితే ఆండ్రాయిడ్‌కి అలాంటి ఆప్షన్ లేదు. కానీ త్వరలో ఈ పరిస్థితి మారనుంది.


ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం ఒకే గూగుల్ అకౌంట్‌తో డివైస్‌లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి సహాయపడే ఒక ఫీచర్‌పై గూగుల్ పని చేస్తోంది. దీనికి సంబంధించి ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ కూడా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. గూగుల్ త్వరలో "కాల్ స్విచింగ్" వంటి ఫీచర్లను ప్రారంభించవచ్చని తెలిపింది.


ఇది కాల్ సమయంలో కనెక్ట్ అయ్యే  డివైసెస్ మధ్య స్విచ్ అవ్వడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అదేవిధంగా లింక్ అయిన డివైసెస్‌లో వ్యక్తిగత హాట్‌స్పాట్‌ను త్వరగా సెటప్ చేయడంలో సహాయపడే "ఇంటర్నెట్ షేరింగ్" కోసం కూడా ఒక ఆప్షన్ ఉండనుంది.


కొత్త ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసిన తర్వాత సెట్టింగ్స్‌లోని గూగుల్‌పై క్లిక్ చేస్తే డివైసెస్, షేరింగ్‌లో కనిపిస్తాయని నివేదికలో తెలిపారు. అధికారికంగా గూగుల్ ఈ ఫీచర్‌కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది నిజంగా అందుబాటులోకి వస్తే ఒకటి కంటే ఎక్కువ ఆండ్రాయిడ్ డివైజ్‌లను ఉపయోగించే యూజర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది.


"ఐఫోన్ మొబైల్ కాల్" కంటే గూగుల్ "కాల్ స్విచింగ్" ఫీచర్ మరింత అధునాతనంగా ఉంటుందని నివేదిక పేర్కొంది. యాపిల్‌లో ఈ ఫీచర్ వినియోగదారులు మ్యాక్‌లు, ఐప్యాడ్లు వంటి యాపిల్ డివైసెస్‌లో కాల్స్‌ డయల్ చేయడానికి, స్వీకరించడానికి అనుమతిస్తుంది. అయితే ఇది ఒక ఐఫోన్ నుంచి మరొకదానికి కాల్ ట్రాన్స్‌ఫర్‌ను అనుమతించదు. కానీ గూగుల్ "కాల్ స్విచింగ్" ఫీచర్ పదాలు ఫోన్‌లతో సహా వివిధ ఆండ్రాయిడ్ డివైసెస్ మధ్య స్విచ్ అవ్వడానికి దీన్ని ఉపయోగించవచ్చని సూచిస్తున్నాయి.


మరోవైపు జియో తన కొత్త ఇండిపెండెన్స్ డే 2023 ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.2,999గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా కాలింగ్, డేటా లాభాలు జియో లభించనున్నాయి. ఫుడ్ డెలివరీ సర్వీసులు, ట్రావెల్ రిజర్వేషన్లు, ఆన్‌లైన్ షాపింగ్‌లపై డిస్కౌంట్లు కూడా జియో దీని ద్వారా అందించనుంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.2,999గా నిర్ణయించారు. దీని వ్యాలిడిటీ 365 రోజులుగా ఉండనుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ వంటి లాభాలు లభించనున్నాయి. అంటే మొత్తంగా 912.5 జీబీ డేటాను జియో అందించనుందన్న మాట. దీంతోపాటు మరిన్ని ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


Read Also: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial