Google Pixel 7 Pro Offer: నవంబర్ 10వ తేదీన దేశవ్యాప్తంగా ధన్‌తేరాస్ జరుపుకుంటారు. ఈ రోజున మనదేశంలో చాలా మంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే కొంతమంది తమ కోసం కొత్త మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ప్రిఫర్ చేస్తారు. గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.


గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఆఫర్ వివరాలు
గూగుల్ పిక్సెల్ 7 ప్రో... ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 74,999 ధరతో లీక్ అయింది. లాంచ్ ధర కంటే ఇది రూ. 14,000 తక్కువ. మీరు ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే, మీకు రూ. 500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. మీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై రూ. 37,100 తగ్గింపును కూడా పొందుతారు. అంటే ఈ ఫోన్‌ను రూ. 37,300కే కొనుగోలు చేయవచ్చన్న మాట.


ఇది కాకుండా మీరు కాంబో ఆఫర్‌లో Google ఇయర్‌బడ్స్‌ను కూడా కొనుగోలు చేస్తే, మీరు గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై 25 శాతం అదనపు తగ్గింపును కూడా పొందుతారు. దానిని తగ్గించడం ద్వారా మీరు ఈ ఫోన్‌ను రూ. 27,975కు మాత్రమే కొనవచ్చు. ఈ ఆఫర్ కాకుండా, మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు తగ్గింపును పొందవచ్చు అంటే ఈ ఫోన్‌ని రూ. 22,975కి కొనుగోలు చేయవచ్చన్న మాట.


గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు (Google Pixel 7 Pro Features)
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌పై గూగుల్ పిక్సెల్ 7 ప్రో రన్ కానుంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా గూగుల్ అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లను కూడా అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్‌లను ఈ స్మార్ట్ ఫోన్‌ సపోర్ట్ చేయనుంది. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు ఇందులో బ్యాటరీ బ్యాకప్ రానుందని గూగుల్ అధికారికంగా ప్రకటించింది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?