Google I/O 2023: గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 ఈరోజు రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త డెవలప్‌మెంట్‌ను అందజేయనుంది. ఇందులో కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్, కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మొదలైనవి ఉన్నాయి. ఈ సంవత్సరం Google I/O చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే కంపెనీ తన మొదటి పిక్సెల్ టాబ్లెట్‌తో పాటు తన మొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ 7ఏ కూడా అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ కానుంది. హార్డ్‌వేర్‌తో పాటు Google ఈ ఈవెంట్‌లో ఏఐ గురించి, ఏఐ చాట్‌బాట్ బార్డ్ గురించి కూడా తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు ఆండ్రాయిడ్ 14కు సంబంధించి కూడా ఏదో ఒక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.
Google I/O 2023ని ఎలా చూడాలి?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మీరు ఈ ఈవెంట్‌ను చూడాలనుకుంటే Google తన YouTube ఛానెల్‌లో మొత్తం ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. Google ఇప్పటికే దీనికి సంబంధించిన స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేసింది. Google I/O 2023 రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. Google I/O కీనోట్‌లు సాధారణంగా చాలా లెంగ్తీగా ఉంటాయి. వీటి నిడివి సాధారణంగా గంటకు పైనే ఉంటుంది.
Also Read: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!
Google I / O 2023లో ప్రత్యేకంగా ఏమి ఉంటుంది?
గూగుల్ తన పెద్ద ఈవెంట్‌లో పిక్సెల్ 7ఎని లాంచక కానుంది. ఈరోజు లాంచ్ అయిన తర్వాత గూగుల్ పిక్సెల్ 7ఏ రేపటి నుండే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. Samsung, Oppo, OnePlus ఆధిపత్యం వహించే మిడ్ బడ్జెట్ విభాగంలో పిక్సెల్ 7a కంపెనీకి గేమ్-ఛేంజర్ కావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ పిక్సెల్ 7ఏ ధర దాదాపు రూ. 45 వేల వరకు ఉండవచ్చు.
ఈ ఈవెంట్ ప్రధాన ఆకర్షణ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్. ఈ గూగుల్ ఫోల్డబుల్ ఫోన్... Samsung Galaxy Z Fold 4, Oppo Find N2 మొబైల్స్‌తో పోటీపడుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్‌ను గూగుల్ ఇప్పటికే రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 కంటే పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఇక పిక్సెల్ టాబ్లెట్ విషయానికి వస్తే... అన్ని ప్రధాన సాఫ్ట్‌వేర్‌ల సపోర్ట్‌తో కంపెనీ 10 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ టాబ్లెట్ ధర దాదాపు రూ. 50 వేల వరకు ఉండవచ్చు. అయితే ఇది భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు.