ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు HRA పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ ను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచింది ఏపీ ప్రభుత్వం. పార్వతీపురం, పాడేరు, అనకాపల్లి, అమలాపురం, భీమవరం, బాపట్ల, నరసరావుపేట, పుట్టపుర్తి, రాయచోటిలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో లబ్ది చేకూరనుంది. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.