బ్రిటన్‌కు రాణి క్వీన్ ఎలిజబెత్ II మరణానికి నివాళిగా గూగుల్ తన హోం పేజ్ రంగులను మార్చింది. లోగో రంగును గ్రే కలర్‌కు ఛఏంజ్ చేసింది. సాధారణంగా గూగుల్ లోగో కలర్‌ఫుల్‌గా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కేవలం యూకేలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చింజన్ రంగు మారింది. మీరు గూగుల్ హోం పేజ్‌కు వెళ్లినా అదే రంగు కనిపిస్తుంది.
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫా సీఈవో అయిన సుందర్ పిచాయ్ కూడా ఇంగ్లండ్ రాణి మరణానికి నివాళులు అర్పించారు. యాపిల్ కూడా క్వీన్ ఎలిజబెత్ మరణానికి నివాళిగా తన హోం పేజీని మార్చింది. అందులో క్వీన్ ఎలిజబెత్ యుక్తవయసులో ఉన్నప్పుడు ఫొటోలను చూడవచ్చు.
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-II సెప్టెంబర్ 8వ తేదీన కన్నుమూశారు. క్వీన్ ఎలిజబెత్-II వయసు 96 సంవత్సరాలు. 25వ ఏట నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నారు. ఆమె స్కాట్లాండ్ లోని బల్మోరల్ కోటలో తుది శ్వాస విడిచారు. ఎలిజబెత్-2.. ఏప్రిల్ 21వ తేదీ, 1926లో లండన్‌లోని 17 బ్రూటన్ స్ట్రీట్‌లో జన్మించారు. గ్రీస్ యువరాజు, నేవీ లెఫ్టినెంట్ ఫిలిప్ మౌంట్‌బాటెన్‌ను 1947లో ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు.. ప్రిన్స్ ఛార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ సంతానం. 1952, ఫిబ్రవరి 6వ తేదీన తండ్రి మరణించడంతో వారసురాలిగా ఎలిజబెత్‌ను ప్రకటించారు. అయితే ఆ టైంకి ఆమె రాయల్ టూర్‌లో కెన్యాలో ఉన్నారు. ఏడాది తర్వాత జూన్ 2వ తేదీన ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో బ్రిటన్‌కు రాణిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేక సమయంలో బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఉన్నారు. 15 మంది ప్రధానులు.. ఈమె హయాంలో బ్రిటన్‌కు పని చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్‌తోపాటుగా పద్నాలుగు దేశాల సార్వభౌమత్వం ఎలిజబెత్-2 చేతిలోనే ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆంటిగ్వా, బార్బుడా, బెహమస్, బెలిజే, గ్రెనెడా, పాపువా న్యూ గినియా, సోలోమన్ ఐల్యాండ్స్, సెయింట్ కిట్స్ అండ్ నేవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ది గ్రెనాడైన్స్, తువాలుకు కూడా క్వీన్ ఎలిజబెత్-2 మహారాణిగా వ్యవహరిస్తున్నారు.
2015 నాటికే ఎలిజబెత్-2 ఇప్పటికే క్వీన్ విక్టోరియాను దాటేసి బ్రిటన్ పాలకురాలిగా అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. క్వీన్ ఎలిజబెత్ - 2 భర్త ఫిలిప్ 2021 ఏప్రిల్‌లో కన్నుమూశారు. 2002లో ఎలిజబెత్-II తల్లి మరణించిన సమయంలో అంత్యక్రియల్లో 1,600 ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?