Swami Swaroopanand Saraswati: ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారు. సుదీర్ఘ అస్వస్థతతో ఆదివారం ఆయన శివైక్యం చెందారు. 99 ఏళ్ల స్వరూపానంద సరస్వతి మధ్యప్రదేశ్‌లోని నర్సింగపుర్‌లో ఉన్న శ్రీథామ్ జోతేశ్వర్ ఆశ్రమ్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు తుది శ్వాస విడిచారు.
ప్రొఫైల్
- 1924లో సెప్టెంబర్ 2న మధ్యప్రదేశ్ సియోని జిల్లా డిఘోరి గ్రామంలో జన్మించారు శంకరాచార్య స్వామి.
- బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శంకరాచార్య తన 9వ ఏటనే ఇల్లు విడిచిపెట్టారు.
- హిందూమత ఉద్ధరణ కోసం యూపీలోని వారణాసికి చేరుకున్నారు.
- స్వామి కర్పత్రి మహరాజ్ వద్ద శంకరాచార్య స్వామి వేదాలు అభ్యసించారు.
- రివల్యూషనరీ సాధువుగా పేరు తెచ్చుకున్న శంకరాచార్య స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
- అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కూడా కృషి చేశారు.
- 1982లో గుజరాత్‌లోని ద్వారాకా శారదా పీఠం సహా బద్రినాథ్‌లోని జ్యోతిర్ మఠానికి శంకరాచార్య అయ్యారు.
మోదీ దిగ్భ్రాంతి
స్వరూపానంద సరస్వతి పరమపదించారని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు.
ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి పరమపదించారని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దుఃఖ సమయంలో ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతి. - ప్రధాని నరేంద్ర మోదీ
ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి జీ శివైక్యం చెందారనే వార్త వచ్చింది. సనాతన సంస్కృతి, మత ప్రచారానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Also Read: Viral News: రాత్రి దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రపోయిన మహిళ- తెల్లారేసరికి!
Also Read: Bihar News: అడ్మిట్ కార్డులపై ధోని, ప్రధాని మోదీ ఫొటోలు!