సౌత్ కొరియన్ స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.  సరికొత్త గెలాక్సీ ఎఫ్ సిరీస్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అవుతోంది. ఈ సరికొత్త శాంసంగ్ Galaxy F54 5G స్మార్ట్ ఫోన్ ను వచ్చేనెల(జూన్ 6, 2023న) విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.   


Galaxy F54 5G ప్రీ బుకింగ్స్ షురూ


వాస్తవానికి భారత్ లో శాంసంగ్ F సిరీస్ కి చెందిన ప్రీమియం స్మార్ట్ ఫోన్లకు వినయోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే,  సరికొత్త ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ను వినియోగదారుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను కంపెనీ మొదలు పెట్టింది. ఈ లేటెస్ట్  స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారు  లాంచింగ్ కు ముందుగానే  ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్   ఫ్లిప్ కార్ట్ తో పాటు శాంసంగ్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకునే వినియోగదారులు రూ. 999 చెల్లించాలని తెలిపింది.  ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రూ.2 వేల విలువైన బెనిఫిట్స్ అందించనున్నట్లు ప్రకటించింది. Galaxy F54 5G  స్మార్ట్ ఫోన్ ధర దాదాపు రూ.30,000 ఉండే అవకాశం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక Galaxy F54 5G 6.7-అంగుళాల FHD+ సూపర్ AMOLED ప్లస్ ఇన్ఫినిటీ-O డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. మాలి-G68 MP5 GPUతో కంపెనీ అంతర్గత Exynos 1380 SoC ద్వారా అందించబడుతుంది. ర్యామ్, స్టోరేజ్ పరంగా చూస్తే 6GB/8GB RAMతో పాటు 128GB/256GB స్టోరేజ్ వేరియంట్ ఉండవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 13లో Samsung స్వంత One UI 5.1తో రన్ కావచ్చు. 25 W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో 6,000mAh బ్యాటరీ ఉండవచ్చు.


అదిరిపోయే ట్రిఫుల్ కెమెరా సెటప్


ఈ సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ స్మార్ట్ ఫోన్ నైటోగ్రఫీ అనే సరికొత్త కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. దీని సహాయంతో తక్కువ లైటింగ్ లోనూ అద్భుతమైన ఫోటోలను తీసే అవకాశం ఉంటుంది. 108 మెగా ఫిక్సెల్ మెయిన్ కెమెరాతో రానుంది. ఫోటోలలో బ్లర్, షేక్ కాకుండా చక్కటి ఫోటోలు తీసే అవకాశం ఉంటుంది. తాజాగా వచ్చిన టీజర్ ఫోటో ప్రకారం ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.  దీనితో పాటు ఆస్ట్రోలాప్స్ అనే మరొక కొత్త  ఫీచర్ ను కూడా శాంసంగ్  కంపెనీ తీసుకురాబోతోంది. దీని సాయంతో  చీకటిలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చాలా అద్భుతంగా ఫోటో తీసే అవకాశం ఉంటుంది. ఈ మోడల్ ఒప్పో రెనో 8, ఐక్యూ నియో 7, కొత్త పోకో ఎఫ్5 వంటి వాటికి ప్రత్యర్థిగా నిలవనుంది.


Read Also: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్