యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty), అగ్ర కథానాయిక అనుష్క శెట్టి (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr Polishetty Movie). ఇందులో తొలి పాటను ఆల్రెడీ విడుదల చేశారు. అది వైరల్ అయ్యింది. ఇప్పుడు రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇదీ వైరల్ అయ్యేలా ఉంది. 


ధనుష్ పాడిన హతవిధీ...
హీరో కష్టాలకు అంతు ఏది?
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' కోసం రామ జోగయ్య శాస్త్రి రాసిన 'హతవిధీ... ఏందిది' పాటను ధనుష్ ఆలపించారు. రధన్ సంగీతం అందించారు. ఈ రోజు ఆ పాటను విడుదల చేశారు. 


'హతవిధీ... ఏందిది? ఊహలో లేనిది!
బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది!
చిటపటాసు ఫాథరూ... కట్ కటీఫు లవ్వరు!
నత్తనడుమ జిందగీ... అప్పడమైనది!
వాట్ ఏ డ్యామేజీ... చెవిలో క్యాబేజీ!
ఎట్టా కుదురుద్ది... టేక్ ఇట్ ఈజీ!'
అంటూ ట్రెండీ సాహిత్యం అందించారు రామజోగయ్య శాస్త్రి. 'వై థిస్ కొలవెరి కొలవెరి ఢీ' తరహాలో ధనుష్ పాడారు. హీరోకి ఎదురైన కష్టాలను, అతడి దురదృష్టాన్ని ఈ పాటలో చూపించారు. నవ్వుల పాలైన జీవితాన్ని ఆవిష్కరించారు. తొలుత ఈ పాటను నవీన్ పోలిశెట్టి పాడాలని ట్రై చేసినట్టు... దర్శక, రచయితలు, సంగీత దర్శకుడు ఒప్పుకోనట్టు వెరైటీగా సాంగ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 


Also Read : 'పుష్ప 2' యూనిట్ వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ - ఆర్టిస్టులు లేరు కానీ!



నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు .పి దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అనుష్కకు 48వ చిత్రమిది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి.


'జీ' చేతికి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'  
అనుష్క సినిమా శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ చేతికి వెళ్లాయి. అవును... 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' డిజిటల్ రైట్స్‌ను 'జీ' గ్రూప్ కొనుకోలు చేసింది. సినిమా విడుదలైన కొన్ని రోజులకు 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు జీ గ్రూప్ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తారు. అనుష్క సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన 'భాగమతి' హిందీ, తమిళ వెర్షన్స్ 'జీ 5'లో ఉన్నాయి. 'సైజ్ జీరో' తెలుగు వెర్షన్ కూడా 'జీ 5'లో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలూ ఉన్నాయి.


అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్... యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ ఇమేజ్... అన్నీ కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాపై క్రేజ్ పెంచాయి. అందుకని, విడుదల తేదీ ఖరారు కావడానికి ముందు డిజిటల్, శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసి మరీ జీ తెలుగు తీసుకుంది.


Also Read తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!