Sony PlayStation 5 Pro: మోస్ట్ అవైటెడ్ ప్లేస్టేషన్ 5 ప్రోను సోనీ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది సోనీ పీఎస్5కి అప్‌గ్రేడెడ్ వెర్షన్. గురువారం ఇది కొన్ని సెలక్టెడ్ మార్కెట్లలో లాంచ్ అయింది. సెప్టెంబర్‌లో కంపెనీ దీన్ని మొదటగా అనౌన్స్ చేసింది. అప్‌గ్రేడ్ చేసిన జీపీయూ, అడ్వాన్స్‌డ్ రే ట్రేసింగ్ ఫీచర్లు, ఏఐ అప్‌స్కేలింగ్ టెక్నాలజీతో ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫీచర్లు ఇమేజ్ క్వాలిటీని మెరుగు పరచడంతో పాటు పీఎస్5 కంటే స్టోరేజ్‌ను రెట్టింపు చేయనున్నాయి. అయితే ఇందులో డ్రైవ్ బాక్స్‌తో పాటు రాదు. దాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి. దీంతో పాటు కంపెనీ పీఎస్5 ప్రో కోసం 50 ఎన్‌హేన్స్‌డ్ గేమ్స్ లిస్ట్‌ను కూడా తెలిపింది.


సోనీ పీఎస్5 ప్రో ధర (Sony PS5 Pro Price)
పీఎస్ 5 ప్రో ధరను అమెరికాలో 699.9 డాలర్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.58,750) నిర్ణయించారు. యూకే, యూరోప్‌లోని మిగతా దేశాలు, జపాన్‌లో కూడా ఇది అందుబాటులో ఉంది. డిస్క్ డ్రైవ్ కావాలంటే 79.99 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.6,740), వర్టికల్ స్టాండ్ కోసం 29.99 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.2,530) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇవి లేకుండా కూడా పీఎస్5ని ఉపయోగించుకోవచ్చు.


స్టాండర్డ్ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గ్రే కలర్‌లో దీనికి సంబంధించిన లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. పీఎస్5 ప్రో అధికారికంగా భారత దేశంలో ఎప్పుడు లాంచ్ చేస్తుందో కంపెనీ తెలపలేదు. కానీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు.



Also Read: అనుకున్న దాని కంటే ముందే ఆండ్రాయిడ్ 16 - ఎప్పుడు రానుందంటే?


సోనీ పీఎస్5 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Sony PS5 Pro Specifications)
పీఎస్5కు కొన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్లు చేసి పీఎస్5 ప్రోని కంపెనీ మార్కెట్లో లాంచ్ చేసింది. మెరుగైన ఫ్రేమ్ రేట్లు, హయ్యర్ రిజల్యూషన్‌ని ఇది అందించనుంది. దీనికి సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్లు కూడా కంపెనీ రివీల్ చేసింది. పీఎస్5లో అందించిన ఏఎండీ రైజెన్ జెన్ 2 సీపీయూనే ఇందులో కూడా అందించనున్నారు. కానీ ఆర్‌డీఎన్ఏ గ్రాఫిక్స్‌ను మాత్రం 16.7 టెరాఫ్లాప్‌ల జీపీయూతో మెరుగు పరిచారు. దీంతో కన్సోల్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ చాలా మెరుగయింది.


సిస్టం టాస్క్‌ల కోసం 16 జీబీ జీడీడీఆర్6 మెమొరీ, 2 జీబీ డీడీఆర్5 ర్యామ్‌ను ఇందులో అందించారు. పీఎస్5 ప్రో 2 టీబీ కస్టమ్ ఎస్ఎస్‌డీ కూడా ఉంది. స్టాండర్డ్ పీఎస్5 స్టోరేజ్ కంటే ఇది రెట్టింపు కావడం విశేషం. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... పీఎస్5 ప్రోలో రే ట్రేసింగ్ సామర్థ్యం ఉంది. ఇది మరింత యాక్యురేట్, రియలిస్టిక్ లైటింగ్‌ను అందించనుంది. గేమ్‌లో రిఫ్లెక్షన్స్ కూడా ఇందులో చాలా బాగుంటాయి. సోనీ కొత్త ఏఐ అప్‌స్కేలింగ్ ఫీచర్‌ను కూడా మొదటిసారిగా ఇందులో అందించారు. దీనికి ప్లేస్టేషన్ స్పెక్ట్రల్ సూపర్ రిజల్యూషన్ (PSSR) అని పేరు పెట్టారు. మెరుగైన ఇమేజ్ క్వాలిటీ కోసం మెషీన్ లెర్నింగ్ బేస్డ్ టెక్నాలజీని ఇది ఉపయోగించనుంది.


పీఎస్5 ప్రో ఎన్‌హేన్స్‌డ్ గేమ్స్ కూడా...
ఈ వారం ప్రారంభంలోనే సోనీ 50కి పైగా గేమ్స్‌ను పీఎస్5 ప్రోకు తగ్గట్లు ఎన్‌హేన్స్ చేసినట్లు సోనీ ప్రకటించింది. ఇంకా మరిన్ని గేమ్స్ కూడా దీనికి తగ్గట్లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. వీటిలో అసాసిన్స్ క్రీడ్ మిరేజ్ (Assassin's Creed Mirage), కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఆప్స్ 6 (Call of Duty: Black Ops 6), ఈఏ స్పోర్ట్స్ ఎఫ్‌సీ 25 (EA Sports FC 25), గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ (God of War Ragnarok), మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్ (Marvel's Spider-Man Remastered)... ఇంకా మరెన్నో సూపర్ హిట్ గేమ్స్ ఈ సిరీస్‌లో ఉన్నాయి.



Also Read: యాపిల్, గూగుల్‌కు శాంసంగ్ పోటీ - ఎస్25 స్లిమ్ లాంచ్ త్వరలో!