Samsung Galaxy Ring 2 Launch Date: దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీ శాంసంగ్ తన గెలాక్సీ రింగ్ 2ను వచ్చే నెలలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. జనవరి 22వ తేదీన జరగనున్న అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్25 సిరీస్‌తో పాటుగా దీనిని పరిచయం చేయవచ్చు. తర్వాతి తరం గెలాక్సీ రింగ్ మరిన్ని సైజుల్లో లభ్యం కానుంది. ఇందులో మునుపటి కంటే మరిన్ని ఫీచర్లను కూడా ఇవ్వవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఈ సంవత్సరం జూలైలో గెలాక్సీ రింగ్‌ను ప్రారంభించింది. ఇది కొన్ని నెలల క్రితం భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.


శాంసంగ్ గెలాక్సీ రింగ్ 2 గురించి ఏ సమాచారం బయటకు వచ్చింది?
శాంసంగ్ గెలాక్సీ రింగ్ 2 ప్రస్తుతం ఉన్న తొమ్మిది సైజులు మాత్రమే కాకుండా మరో రెండు సైజుల్లో మార్కెట్లోకి రానుంది. ఇది కాకుండా మరింత ఖచ్చితత్వంతో డేటాను సేకరించడానికి దాని హెల్త్ సెన్సార్ మెరుగుపరిచారు. ఇది మునుపటి కంటే మెరుగైన ఏఐ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై ఏడు రోజుల పాటు పని చేస్తుంది. ప్రస్తుతం ఈ రింగ్ 5 నుంచి 13 వరకు వేర్వేరు సైజుల్లో వస్తుంది. గెలాక్సీ రింగ్‌ను టైటానియంతో తయారు చేశారు. ఇది నీరు, దుమ్ము తగిలినా పాడవ్వకుండా ఉండటం కోసం ఐపీ68 రేటింగ్‌ను పొందింది. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


మొదటి రింగ్ ఇటీవలే లాంచ్...
ఈ ఏడాది జనవరిలో శాంసంగ్ తొలిసారిగా స్మార్ట్ రింగ్‌ను పరిచయం చేసింది. దీని తరువాత ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా దీని వివరాలను వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6లతో పాటు గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో జూలైలో లాంచ్ అయింది. ఇది అక్టోబర్ నుంచి భారతదేశంలో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో దీని ధర రూ.38,999 నుంచి ప్రారంభమవుతుంది.


అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌పై అందరి దృష్టి
జనవరి 22వ తేదీన శాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. దీనిలో తదుపరి తరం రింగ్, గెలాక్సీ ఎస్25 సిరీస్‌లను లాంచ్ చేయడంతో పాటు ఏఆర్ స్మార్ట్ గ్లాసెస్‌లను కూడా పరిచయం చేయవచ్చు. క్వాల్‌కాం, గూగుల్ సహకారంతో కంపెనీ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ఇది అధునాతన చిప్, తాజా ఏఐ మోడల్‌తో మార్కెట్లోకి రానుంది. దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?