Flashgard: స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఫ్లాష్‌గార్డ్‌ను ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విడుదల చేసింది. దేశంలో ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డిస్‌ప్లే భద్రత కోసం దీనిని రూపొందించారు. వినియోగదారులకు అనుకూలమైన సాంకేతిక పరిష్కారాలను అందించడం ఫ్లాష్‌గార్డ్‌ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వినియోగదారులకు సాంకేతిక పరిష్కారాలను అందించడంతో పాటుగా వారి ఎలక్ట్రానిక్ ఐటమ్స్‌ను అన్ని రకాల ప్రమాదాలు, నష్టాల నుంచి కాపాడటంలో దోహదం చేస్తుంది. స్క్రీన్ గార్డ్ లేదా ఫోన్‌ బ్యాక్‌ కవర్‌ కోసం స్టోర్‌ను సందర్శిస్తే, రిటైలర్‌ మెషీన్‌లో ఫిల్మ్‌ను ఫీడ్‌ చేసి అప్లికేషన్‌ ద్వారా మీకు కావాల్సిన డిజైన్‌ తెలుకుని మెషీన్‌ ద్వారా ఫిల్మ్‌ కట్‌ చేస్తారు. కోరుకున్న డిజైన్ పొందే వీలుంది.


ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇప్పుడు డిజిటల్‌ యాక్సెసరీ పరిశ్రమను తమ యాప్‌తో పాటుగా అత్యున్నత పనితీరు కలిగిన మెటీరియల్స్‌తో, వినియోగదారులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. అద్భుతమైన డిజైన్లతో పాటు స్క్రీన్ ప్రొటెక్షన్‌ సొల్యూషన్స్‌ కోసం పలు అంశాలపై ఫ్లాష్‌గార్డ్‌ పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్‌ స్క్రీన్ ప్రొటెక్షన్‌, యాంటీ మైక్రోబియాల్‌ ఫిల్మ్స్‌, ప్రైవసీ ఫిల్మ్స్‌, బ్యాక్‌ ప్యానెల్స్‌ కోసం రూపొందించారు. అన్ని గాడ్జెట్స్‌కూ ముందు మరియు వెనుక భాగం రక్షణను తగిన టెక్నాలజీ సాయాన్ని ఫ్లాష్‌గార్డ్‌ కలిగి ఉంది. ఈ ఉత్పత్తులు రిటైలర్లకు వారి వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యర్ధాలను తగ్గించి, స్టాక్‌ పరంగా నష్టాలేవీ ఉండవన్న భరోసా కల్పిస్తుంది. 


ఫ్లాష్‌గార్డ్‌ అందించే ఈ ఉత్పత్తులు అసాధారణ రక్షణ అందించడంతో పాటు స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా గాడ్జెట్స్‌ లుక్‌, ఫీల్‌ ను యాప్‌లోని 7వేలకు పైగా  డిజైన్స్‌తో కూడా మారుస్తుంది. అత్యుత్తమ నాణ్యత  కలిగిన ఫిల్మ్స్‌, మ్యాటీ ఫిల్మ్స్‌, కాన్వాస్‌ బ్యాక్‌ ఫిల్మ్స్‌ మరియు యాంటీ మైక్రోబియాల్‌ ఫిల్మ్స్‌ను  మొబైల్‌ ప్రొటెక్షన్‌ కోసం ఫ్లాష్‌గార్డ్‌ అందిస్తుంది. కాన్వాస్‌–ప్లే పేరుతో కొత్త మోడల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. దీనిద్వారా కోరుకున్న కాన్వాస్‌ స్క్రీన్స్ పొందుతారు. బ్లూ లైట్‌ రిడక్షన్‌ ఫిల్మ్స్‌ తో పాటు ప్రైవసీ ఫిల్మ్స్‌, సర్ఫేస్‌ స్కిన్నింగ్‌ ఫిల్మ్స్‌ త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.
Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


రిటైలర్లకు అత్యంత ఖరీదైన డిస్‌ప్లే చోటును తగ్గించుకోవడంతో పాటుగా విక్రయాలు జరగవు అనే సమస్యకు చెక్ పెడుతుంది. రిటైలర్లు అతి తక్కువ పెట్టుబడి పెట్టేందుకు భరోసా కల్పిస్తోంది.  ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కేవలం కొద్ది నెలల్లోనే దేశ వ్యాప్తంగా 2వేలకుపైగా ఫ్లాష్‌గార్డ్‌ మెషీన్లు ఏర్పాటు చేసింది. ఫ్లాష్‌  సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన ఫ్లాష్‌గార్డ్‌ను ఆవిష్కరించడంపై ఫ్లాష్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు ఆన్‌ డిమాండ్‌ స్క్రీన్ ప్రొటెక్షన్‌ ఫిల్మ్స్‌ ను అందించేందుకు ఫ్లాష్‌గార్డ్‌ను తీసుకొచ్చాం. ఇది మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్లు పగలకుండా కాపాడటంతో పాటుగా మరకలు, గీతలు పడకుండా కూడా చేస్తుంది. హైదరాబాద్‌లో ఎం–టెక్‌ ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఇది మొబైల్‌ పరికరాలు, ఇతర గాడ్జెట్స్‌ సేవలు అందించనుంది.


ఫ్లాష్‌గార్డ్.. ఇది మొబైల్స్, ఇతర పరికరాలకు అత్యుత్తమ  భద్రతను అందిస్తుందని.. రాబోయే ఐదేళ్లలో సేవల్ని విస్తరిస్తామని ఫ్లాష్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు అజయ్ శర్మ అన్నారు. రిటైలర్లతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా వినియోగదారుల ప్రవర్తనను అర్ధం చేసుకుంటూ వారికి కావాల్సిన తీరుగా ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు.
Also Read: Gold Rate Today: తగ్గేదేలే.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా..  
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి