Call Recording: మీరు మొబైల్‌లో మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు కాల్ రికార్డింగ్‌ను ఫేస్ చేసి ఉంటారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ముందుజాగ్రత్తగా కూడా మీరు కొన్ని విషయాల్లో శ్రద్ధ వహించడం అవసరం. తద్వారా కాల్ రికార్డింగ్ వంటి వాటిని నివారించవచ్చు.


కొన్ని దేశాల్లో చట్టవిరుద్ధం
అనేక దేశాల్లో కాల్ రికార్డింగ్ చట్టవిరుద్ధం. ఈ కారణంగా కాల్‌లను Google, థర్డ్ పార్టీ యాప్ ద్వారా రికార్డ్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మీరు స్మార్ట్‌ఫోన్‌లోని ఇన్‌బిల్ట్ యాప్ నుంచి మాత్రమే కాల్‌లను రికార్డ్ చేయవచ్చు.


కాల్ రికార్డింగ్ అనౌన్స్‌మెంట్
ఇప్పుడు లాంచ్ అవుతున్న కొత్త మొబైల్ ఫోన్స్ నుంచి కాల్ రికార్డింగ్ చేస్తే, మీరు కాల్ రికార్డింగ్ అనౌన్స్‌మెంట్ వింటారు. ఇది వినడం ద్వారా అవతలి వైపు వ్యక్తి మీ కాల్‌ని రికార్డ్ చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు.


బీప్ సౌండ్
మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మధ్యమధ్యలో బీప్ శబ్దం వినిపిస్తుంతే మీ సంభాషణ రికార్డ్ అవుతుందని అనుకోవచ్చు. లేకపోతే మొబైల్‌లో ఏదైనా ఇన్‌కమింగ్ కాల్ లిఫ్ట్ చేయగానే లాంగ్ బీప్ సౌండ్ వస్తే కాల్ రికార్డింగ్ అవుతుందని అనుకోవచ్చు.


కాల్ రికార్డింగ్ / కాల్ ట్యాపింగ్
చాలా సార్లు ప్రజలు కాల్ ట్యాపింగ్, కాల్ రికార్డింగ్ మధ్య గందరగోళానికి గురవుతారు. ఇక్కడ ఒక సాధారణ విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు లేదా ఇద్దరూ తమ కాల్‌లను మరొకరు రికార్డ్ చేస్తే దాన్ని కాల్ రికార్డింగ్ అంటారు. ఈ కాల్‌లో లేని మూడో వ్యక్తి వీరిద్దరు వ్యక్తుల సంభాషణను రికార్డ్ చేస్తే, దానిని కాల్ ట్యాపింగ్ అంటారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?