Fastest Mobile Internet Provider Countries: డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ప్రజల పనిని చాలా సులభతరం చేసింది. నేటి కాలంలో దాదాపు అన్ని పనులు మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ వేగం ఎంత ఎక్కువగా ఉంటే స్మార్ట్ ఫోన్ ఉపయోగించే అనుభవం అంత బాగుంటుంది. ఒకరకంగా మొబైల్ ఇంటర్నెట్ జీవితంలో భాగమైపోయిందని చెప్పవచ్చు. ఆన్‌లైన్‌లో పని చేయడం, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వినియోగం ఇలా అన్నిటికీ వేగవంతమైన ఇంటర్నెట్ వేగం చాలా ముఖ్యం.


ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో ఇంటర్నెట్‌ను అందించే టాప్ 10 దేశాల జాబితాను వెల్లడించారు. ప్రపంచంలోని 10 వేగవంతమైన ఇంటర్నెట్ అందించే దేశాలు, వాటి ఇంటర్నెట్ వేగం గురించి తెలుసుకుందాం.


ఈ దేశాలు అగ్రస్థానంలో...
ప్రపంచ బ్యాంకు తెలుపుతున్న దాని ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) 398.51 ఎంబీపీఎస్ యావరేజ్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌తో అగ్రస్థానంలో ఉంది. 344.34 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో ఖతార్ రెండో స్థానంలో ఉంది. దేశంలోని పౌరులకు అధిక నాణ్యత గల ఇంటర్నెట్ సేవలను అందించే కువైట్ 239.83 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో మూడో స్థానంలో నిలిచింది.



Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!


తర్వాతి స్థానాల్లో ఈ దేశాలు...
దీని తర్వాత దక్షిణ కొరియా 141.23 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో నాలుగో స్థానంలో నిలిచింది. 133.44 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో నెదర్లాండ్స్ ఐదో స్థానంలో ఉంది. 130.05 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో డెన్మార్క్ ఆరో స్థానంలో నిలిచింది. 128.77 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో నార్వే ఏడో స్థానం దక్కించుకుంది.


122.28 ఎంబీపీఎస్‌తో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లిస్ట్‌లో సౌదీ అరేబియా ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ తర్వాత 117.64 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌తో బహ్రెయిన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. చివరిగా లక్సెంబర్గ్ 114.42 ఎంబీపీఎస్ మొబైల్ ఇంటర్నెట్ వేగంతో పదో స్థానం దక్కించుకుంది.


మనదేశంలో జియో ఎంట్రీ తర్వాత మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువ అయ్యారు. మనదేశంలో యావరేజ్ మొబైల్ ఇంటర్నెట్ దాదాపు 60 ఎంబీపీఎస్‌కు అటూ ఇటుగా ఉంటుందని తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఈ స్పీడ్ తక్కువే అయినా డైలీ టాస్క్‌లు చేసుకోవడానికి ఇది సరిపోతుంది. అంటే యూట్యూబ్ చూడటం, ఓటీటీలో సినిమాలు స్ట్రీమ్ చేయడం, బ్రౌజింగ్, ఛాటింగ్ లాంటి వాటికన్న మాట.


Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!