ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్, మెసెంజర్ యాప్ వాట్సాప్‌ల గురించి ఒక వార్త హల్‌చల్ చేస్తుంది. ఫేస్‌బుక్.. వాట్సాప్ లో ఉండే మన ప్రైవేట్ మేసేజ్‌లను చదివేస్తుందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఇప్పటికే మన వ్యక్తిగత సమాచారంపై దొంగలిస్తుందని ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వాట్సాప్ సందేశాలను తాము చదవబోమని ఇప్పటికే ఫేస్‌బుక్‌ పలు మార్లు వెల్లడించిన విషయాలన్నీ అవాస్తవమేనని తాజా నివేదిక స్పష్టం చేసింది. యూజర్లు ఏమేం చాట్ చేసుకుంటున్నారనే విషయాలను మొత్తం ఫేస్ బుక్ చూస్తుందని చెప్పింది. ప్రోపబ్లికా (ProPublica) అనే సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం.. వాట్సాప్ సందేశాలను చదవడం కోసం ఫేస్ బుక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి (లేదా అంతకంటే ఎక్కువ) మంది ఉద్యోగులను నియమించిందని చెప్పింది. వీరంతా ఎన్‌క్రిప్ట్ చేయబడిన వాట్సాప్ సందేశాలను చదవడంతో పాటు.. కంటెంట్ ను మోడరేట్ చేస్తుంటారని తెలిపింది. దీని కోసం వీరికి కొంత మొత్తాన్ని వేతనంగా చెల్లిస్తున్నట్లు పేర్కొంది. 


ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ప్రైవేట్ మేసేజ్‌లను..
ప్రోపబ్లికా పేర్కొన్న వివరాల ప్రకారం.. మన వాట్సాప్ మేసేజ్‌లను పర్యవేక్షించే ఉద్యోగులు ఆస్టిన్, టెక్సాస్, డబ్లిన్, సింగపూర్ కార్యాలయాలలో విధులు నిర్వర్తిస్తారు. వీరంతా ఫేస్‌బుక్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో కంటెంట్ మోడరేట్ చేస్తారు. వీరు ప్రతి రోజూ మిలియన్ మంది యూజర్ల వ్యక్తిగత వివరాలను అంటే వారి ప్రైవేట్ మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు వంటి వాటిని పర్యవేక్షిస్తుంటారు. దీని కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థల సాయం తీసుకుంటారు. ఇలా మనం ఏం సందేశాలను పంచుకుంటున్నామనే విషయాలపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తుంటారని.. ప్రోపబ్లికా వెల్లడించింది. 
ప్రోపబ్లికా సంస్థ పరిశోధానాత్మక జర్నలిజం కోసం పులిట్జర్ బహుమతిని గెలుచుకుంది. లాభాపేక్షలేని న్యూస్‌రూమ్ గా పేరుగాంచిన ఈ సంస్థ ట్వీట్లలో ఈ విషయాలను వెల్లడించింది.





 
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.






Also Read: Data Protection: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!


Also Read: WhatsApp: వాట్సాప్‌లో కొంతమందికి మాత్రమే మన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ కనిపించేలా ఫీచర్ !