WhatsApp: వాట్సాప్‌లో కొంతమందికి మాత్రమే మన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ కనిపించేలా ఫీచర్ !
ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురానుంది. దీని ద్వారా మన వాట్సాప్ స్టేటస్, లాస్ట్ సీన్ వివరాలు, ప్రొఫైల్ ఫొటో వంటివి ఎవరు చూడాలనే విషయాలను మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ మేరకు వాట్సాప్ తన ప్రైవసీ సెట్టింగ్స్‌ను అప్‌డేట్ చేస్తుందని తెలుస్తోంది.
ఇప్పటివరకు మనం వాట్సాప్ ఫొటో, స్టేటస్, లాస్ట్ సీన్ ఎవరెవరు చూడాలనే ఆప్షన్లలో.. ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ అనే వాటిని చూశాం. ఇప్పుడు కొత్తగా రాబోయే ఫీచర్ ద్వారా మన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్న వారిలో కొంత మంది మాత్రమే మన డీపీ, స్టేటస్, లాస్ట్ సీన్ చూడగలుగుతారు.
డబ్ల్యూఏ బీటా ఇన్ఫో దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ (My Contacts Except) అనే ఈ ఫీచరును యాండ్రాయిడ్, ఐఫోన్లలో పరీక్షిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని.. విజయవంతమైతే త్వరలోనే అన్ని ఫోన్లలోకి రానుందని తెలిపింది.
ఇది సక్సెస్ అయితే ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ ఆప్షన్లకు జతగా మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అనే ఆప్షన్ వస్తుంది.