'Blindsight next': న్యూరాలింక్ ఇంప్లాంట్ ఒక అత్యాధునిక పరికరం. రోగులు కంప్యూటర్‌ సహాయంతో పనులు చేసుకోవటానికి వారి న్యూరల్ సిగ్నల్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇది సాంకేతికతలో ముందడుగుగా అని చెప్పుకోవచ్చు. 


టెక్నాలజీ, వైద్యం కలిగి మెడికల్ మిరాకిల్స్‌ చేయవచ్చని చాటి చెబుతోంది. న్యూరాలింక్‌ టెక్నాలజీ. ఇప్పుడు ఈ టెక్నాలజీతో బ్లైండ్‌సైట్‌కు రూపకల్పన జరుగుతోంది. ఇప్పటికే న్యూరా లింక్ సాయంతో పక్షవాతం వచ్చి భుజాల నుంచి కింది భాగమంతా చచ్చుబడిపోయిన వ్యక్తితో అద్భుతాలు చేశారు. న్యూరాలింక్ సహాయంతో, మొదటిసారి మానవ మెదడులోకి చిప్‌ను ఇంప్లాంట్ చేశారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఆయనతో వీడియో గేమ్స్ ఆడించారు. కేవలం మెదడులోని ఆలోచనలను మాత్రమే ఉపయోగించి కంప్యూటర్‌పై అద్భుతమైన ప్రతిభ చాటాడా వ్యక్తి. ఇందులో పురోగతి సాధించిన న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ చూపులేని వారికి 'బ్లైండ్ సైట్' ద్వారా చూపు తెప్పించటంపై దృష్టి పెట్టారు.  


న్యూరాలింక్, ఎలాన్ మస్క్ స్థాపించిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్. తన మొదటి బ్రెయిన్ ఇంప్లాంట్ పేషెంట్‌ అప్‌డేట్‌ను న్యూరాలింక్ ఈ మధ్యే లైవ్‌లో చూపించింది. నోలాండ్ అర్బాగ్ అనే వ్యక్తి పక్షవాతానికి గురైన రోగి, తన ఆలోచనలను మాత్రమే ఉపయోగించి కంప్యూటర్‌పై వీడియో గేమ్ ఆడాడు.   


29 ఏళ్ల అర్బాగ్ ఎనిమిదేళ్ల క్రితం తన వెన్నెముకకు గాయమైంది. జనవరిలో న్యూరాలింక్ ప్రక్రియను వినియోగించి ఆయన మెదడులో చిప్ అమర్చారు. కేవలం ఒక రోజు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. తన మెదడులోని ఆలోచనలతో కంప్యూటర్‌ ఆపరేట్ చేశాడు అర్బాగ్‌. వీడియో గేమ్ కూడా ఆడాడు. "ఇది ఇప్పటికే నా జీవితాన్ని మార్చివేసింది" అని పేర్కొంటూ చిప్‌ ప్రభావాన్ని చెప్పారు. సాంకేతికతను మరింత మెరుగుపరచడం అవసరమన్న అర్బాగ్ భవిష్యత్తులో మరిన్ని పనులు చేయడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. 


బ్రెయిన్‌లో చిప్‌ పెట్టే ప్రక్రియలో పురోగతి సాధించడంతో బ్లైండ్‌సైట్ తో అంధులు ఈ ప్రపంచాన్ని చూసే ప్రక్రియపై దృష్టి పెట్టారు మస్క్. బ్లైండ్‌సైట్ అనేది కేవలం సాంకేతిక పురోగతిని మాత్రమే కాకుండా, మానవ గుర్తింపు సామర్థ్యాన్ని పునర్నిర్మించడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగొచ్చు.  


మెదడు-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) ద్వారా న్యూరాలింక్ దృష్టిని ఎలా పునరుద్ధరిస్తుంది?


కెమెరా లేదా సారూప్య పరికరాన్ని ఉపయోగించి చూపునకు సంబంధించిన డేటాను సేకరించడంతో  ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ డేటాను మెదడుకు అర్థమయ్యేలా మార్చడానికి కంప్యూటర్ ద్వారా ప్రాసెసింగ్ చేస్తారు.  అనంతరం ఆ డేటా న్యూరాలింక్ పరికరానికి లింక్ చేస్తారు. ఇది విజువల్ కార్టెక్స్‌లో వాటిని డిస్‌ప్లే చేస్తుంది. దీని ద్వార ఆ వ్యక్తికి అవగాహన వస్తుంది.  


జన్యుపరమైన పరిస్థితులు, గాయాలు లేదా అనారోగ్యాల కారణంగా బలహీనమైన చూపును కలిగి ఉన్న వ్యక్తుల కోసం, ఈ విధానం ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. కళ్ళు, ఆప్టిక్ నరాల ద్వారా సాంప్రదాయిక మార్గాలపై ఆధారపడకుండా నేరుగా మెదడే సమాచారాన్ని స్వీకరించి ప్రోసెస్ చేస్తుంది. అది పంపే సంకేతాలు ద్వారా డేటాను వ్యక్తి అర్థం చేసుకుంటాడు.  


ఈ సాంకేతిక పురోగతి అంధత్వం వంటి సవాళ్లను అధిగమిస్తుందంటే ఒక సంతోషకరమైన విషయమే. ఇది చూపులేని వారి జీవితాలను ఒక వరంలాంటిది. BCIల ద్వారా చూపును పునరుద్ధరించే ఈ ఆలోచన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, ఈ లక్ష్యాన్ని సాధించగలిగే దిశగా ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతున్నాయి.