Elon Musk Payment App: ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఎక్స్/ట్విట్టర్‌ని వేరే లెవల్‌కి తీసుకెళ్లే ప్లానింగ్‌లో ఉన్నారని ప్రస్తుతం అందుతున్న వార్తలను బట్టి తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్‌ని కొనుగోలు చేసి దాన్ని పూర్తిగా మార్చేశాడు. ఎలాన్ మస్క్ ఇప్పుడు ఎక్స్‌ను సూపర్ యాప్‌గా మార్చాలనుకుంటున్నారు. ఈ యాప్‌కి ఎలాన్ మస్క్ ఎవ్రీథింగ్ యాప్ అని పేరు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాన్ మస్క్ ఈ యాప్ తయారు చేయడానికి చాలా కాలంగా కృషి చేస్తున్నాడు. అయితే దీని లాంచ్ గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


షాపింగ్ యాప్‌లా కూడా...
వీడియో-ఆడియో కాలింగ్‌తో సహా దాదాపు అన్ని అవసరమైన ఫీచర్‌లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీని తర్వాత మీరు ఎక్స్ ద్వారా ఎవరికైనా డబ్బు పంపగలరు. ఎలాన్ మస్క్ ఎక్స్‌ని షాపింగ్ యాప్‌గా కూడా మార్చాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.


పేమెంట్ సర్వీస్ టెస్టింగ్ ఆన్ ది వే...
పరిశోధకురాలు నిమా ఓవ్జీ (@nima_owji) ఎక్స్ రాబోయే పేమెంట్స్ ఫీచర్ గురించి చెప్పారు. ఈ పేమెంట్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఎవరికైనా డబ్బు పంపగలరు. దీంతో పాటు వారు బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా చూడగలరు. అయితే పేమెంట్ సిస్టం ఏది అనేది ఇంకా తెలియరాలేదు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?