యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తే.. వ్యూస్ ఆధారంగా ఛానల్‌కు డబ్బులు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కొత్తగా యూట్యూబ్ షార్ట్స్ కు కంటెంట్ క్రియేట్ చేసే యూజర్లకూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టిక్ టాక్ యాప్ కు పోటీగా యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను చాలా రోజుల కిందట తీసుకొచ్చింది. షార్ట్ వీడియోలు క్రియేట్ చేసేవారికి డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ వీడియోలు చేసేవారికి డబ్బులు అందించనుంది. దాని కోసం 100 మిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేసింది.


2021 నుంచి 2022 మధ్య వైరలైన షార్ట్‌ వీడియోలకు రివార్డ్ అందిస్తుంది యూట్యూబ్. సుమారు 100 డాలర్లు( సుమారు రూ.7400) నుంచి 10,000 డాలర్లు(రూ.7,40,000) వరకు యూజర్లకు రివార్డ్‌ ఇవ్వనుంది. కానీ ఈ రివార్డులను సొంతం చేసుకోవాలంటే మాత్రం షరతు ఉంది. అప్ లోడ్ చేసిన వీడియో వ్యూస్ ఆధారంగా.. రివార్డు అందించనుంది.


అంతేకాకుండా.. బోనస్ చెల్లింపులను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి నెల షార్ట్ వీడియోలకు వచ్చిన వ్యూస్‌ను కంటెంట్ క్రియేటర్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్ నిబంధనల ప్రకారం షార్ట్ వీడియోలు క్వాలిఫై అవ్వాలి. టార్గెట్ వ్యూస్ పూర్తయిన వీడియోలకే రివార్డులు రానున్నాయి. భారత్‌తోపాటు యూఎస్, యూకే, బ్రెజిల్, జపాన్, ఇండోనేషియా, నైజీరియా, మెక్సికో, రష్యా , దక్షిణాఫ్రికా దేశాల్లోని కంటెంట్‌ క్రియేటర్లు యూట్యూబ్ ఫండ్ తో డబ్బులు సంపాదించొచ్చు. మరికొన్ని రోజుల్లో దీనిని ఇతర దేశాలకు విస్తరించనుంది.


రివార్డులు రావాలంటే...



  • యూజర్లు 180 రోజుల్లో  అర్హత ఉన్న షార్ట్ వీడియోలు అప్ లోడ్ చేయాలి.

  • షార్ట్స్ వీడియో కచ్చితంగా ఒరిజినల్‌ కంటెంటై ఉండాలి. ఇతర వాటర్‌మార్క్‌లు లేదా లోగోలతో వీడియోలను అప్‌లోడ్ చేస్తే అర్హులు కాదు.

  • ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ ల వీడియోలను వాడకూడదు. 

  • ఇతర యూట్యూబ్‌ ఛానళ్ల వీడియోలను అస్సలు అప్‌లోడ్‌ చేయోద్దు. ఈ వీడియోలు యూట్యూబ్‌ షార్ట్స్‌ ఫండ్‌కు అర్హత సాధించవు.

  • యూజర్లు కచ్చితంగా 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.


క్లెయిమ్ చేయాలంటే ఎలా..



  • యూట్యూబ్ నిబంధనలు తప్పనిసరిగా అంగీకరించాలి.

  • యాడ్‌సెన్స్ ఖాతా పనిచేస్తూ ఉండాలి.


 


Also Read: Huawei Earbuds: పేరుకే ఇయర్ బడ్స్.. కానీ ఏం పనులు చేస్తుందో ఊహించలేరు…


                     Tech Tips: ఫోన్ పోయిందా? గూగుల్ పే, ఫోన్ పే డిలీట్ చేయాలనుకుంటున్నారా?

               Tech Giants: దుమ్మురేపిన యాపిల్.. 3 నెలల్లో 3 లక్షల కోట్ల ఆదాయం!