రోజుల్లో చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు దగ్గర వాట్సాప్ కూడా ఉంటుంది. జనాలు  రోజు వారీ అవసరాలతో పాటు ఉద్యోగులు ఆఫీస్ వ్యవహారాలను వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటారు. చాలా మందికి చాలా రకాలుగా వాట్సాప్ ఉపయోగపడుతుంది. అయితే, వాట్సాప్ లో అందరికీ తెలియని ఫీచర్లు, ట్రిక్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వాటిలో కొన్ని ట్రిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   


ఫాంట్ మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు! 


వాట్సాప్ లో చాలా మంది ఎవరికి మెసేజ్ చేసిన అది ఒకే రకమైన ఫాంట్ లో వెళ్తుంది.  అలా కాకుండా ఫాంట్ ను బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, పదాలు కొట్టేసినట్లు రావడం సహా పలు రకాలుగా మార్చుకొనే అవకాశం ఉంది. ఫాంట్ ను బోల్డ్ చేయాలంటే మీరు బోల్డ్ చేయాలనుకున్న పదానికి లేదంటే వాక్యానికి ముందు, తర్వాత స్టార్(*) గుర్తు పెడితే సరిపోతుంది. ఇటాలిక్ చేయడానికి కూడా ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. కాకపోతే స్టార్(*)కు బదులుగా అండర్ స్కోర్ ( _ ) గుర్తు పెట్టాలి. పదాలు కొట్టేసినట్లు రావడానికి టిల్డే(~) గుర్తు వాడాలి.  వీటిని ఉపయోగించి వాట్సాప్ చాట్ ను మరింత అందంగా చేసుకునే అవకాశం ఉంది.


ముఖ్యమైన మెసేజ్ లకు స్టార్ ఇవ్వండి!


వాట్సాప్ లో  చాలా ముఖ్యమైన మెసేజ్ వచ్చింది. కానీ, ఆ మెసేజ్ వివరాలు వారం, రెండు వారాల తర్వాత అవసరం పడ్డాయనుకోండి. అప్పటికప్పుడు దాన్ని వెతకాలంటే చాలా కష్టం. పది రోజులు వెనక్కి వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే, ముఖ్యమైన మెసేజెస్ కు స్టార్ ఇస్తే సరిపోతుంది. స్టార్ మెసేజెస్ వాట్సాప్ మెసేజ్ లిస్టులో పైనే కనిపిస్తుంది. వెతకాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా  వాట్సాప్ లో స్టార్ మెసేజ్ ల్లోకి వెళ్లి ఆ మెసేజ్ ను చూసుకోవచ్చు. మీకు అవసరమైన మెసేజ్ ని సెలక్ట్ చేసుకున్నాక పైన కనిపించే స్టార్ గుర్తుని క్లిక్ చేస్తే..  ఆ మెసేజ్ ని స్టార్ మెసేజ్ గా మారిపోతుంది.


ఒకే ఫోన్లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడొచ్చు!


వాస్తవానికి ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాటడం సాధ్యం కాదు. కానీ, కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రెండు అకౌంట్లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పారలల్ స్పేస్, డ్యూయల్ స్పేస్, 2 అకౌంట్స్ వంటి మొబైల్ అప్లికేషన్స్ వాడాలి. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్స్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్స్ లో ఏదైనా ఒకదాన్ని ఇన్‌ స్టాల్ చేసుకోవాలి. దానికి అవసరమైన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత, రెండో వాట్సాప్ అకౌంట్ ను మీరు ఇందులో ఉపయోగించవచ్చు.


Also Read: మీ స్మార్ట్ ఫోన్ పోయిందా? వెంటనే ఇలా ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోండి
Also Read: మీ వాట్సాప్ చాట్ ను ఎవరికీ కనిపించకుండా దాచుకోవచ్చు, ఎలాగో తెలుసా!?