Zodiac Signs:  కొందరికి పెళ్లి ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటారు..మరికొందరికి పెళ్లంటే ఎంతో ఆత్రం ఉంటుంది కానీ పెళ్లికాదు. పెళ్లయ్యాక కొందరి జీవితం సంతోషం ఉంటే..మరికొందరికి నిత్యం ప్రత్యక్షనరకం కనిపిస్తుంటుంది. వాస్తవానికి ఇబ్బందులు లేని జీవితాలు ఉండవేమో కానీ రాశులపరంగా చూస్తే ఈ రాశులవారికి మాత్రం పెళ్లి సూటవదంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వీళ్లు పెళ్లిచేసుకున్నప్పటికీ ఆ బంధంలో పూర్తిస్థాయిలో ఇమడలేరు..సంతోషం కన్నా కష్టాలే ఎక్కువ ఉంటాయట. ఆ రాశులేంటో చూద్దాం...


మేష రాశి
మేష రాశివారికి షార్ట్ టెంపర్ ఎక్కువ. చిన్న చిన్న విషయాలపై ఆవేశపడిపోతారు. వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతారు. ఆవేశం వస్తే ఆపడం ఎవ్వరివల్లా కాదు. జీవిత భాగస్వామితోనూ అలాగే ఉంటారు. లైఫ్ పార్టనర్ తో గొడవ జరిగినప్పుడు కూడా అస్సలు తగ్గరు, కాసేపటి తర్వాత క్షమాపణలు చెప్పేందుకు కూడా వెనకాడరు. చేసిన తప్పు ఒప్పుకుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కోపంతో వాళ్లు అన్న మాటలు బంధానికి బీటలు పడేలా చేస్తుంది. అందుకే మేష రాశివారు కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.


Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే


మిథున రాశి..
మిథున రాశివారికి జీవితాంతం ఒక్కరితోనే కలిసి ఉండడం నచ్చదు. అందుకే పెళ్లి కాన్సెప్ట్ వీరికి పెద్దగా నచ్చదు కానీ ఆ బంధంలో అడుగుపెట్టక తప్పదు. పైగా వీళ్లెప్పుడూ తీవ్రమైన షెడ్యూల్ తో బిజీగా ఉంటారు..ఫలితంగా జీవిత భాగస్వామికి అస్సలు టైమ్ కేటాయించరు. ఉద్దరి మధ్యా దూరం పెరగడానికి ఇదికూడా ఓ కారణం. ఆ తర్వాత కూడా ఆ గ్యాప్ ని భర్తీ చేసేందుకు ప్రయత్నించరు. అందుకే వీళ్లకి పెళ్లి పెద్దగా సూట్ కాదు.


కన్యారాశి
కన్యా రాశి వారి విషయానికొస్తే వీళ్లెలా ఉంటారో..ఎదుటివారు కూడా వీళ్లలాగే ఉండాలని కోరుకుంటారు. అన్ని విషయాల్లోనూ పర్ ఫెక్ట్ గా ఉండాలని, తమలాగే ఆలోచించాలని కోరుకుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎప్పటికీ వీరి మనసు తెలుసుకునే నడుచుకోవాలంటారు..జీవిత భాగస్వామితో ఇక్కడే తేడా వస్తుంది. వివాహ బంధంలో సమస్యలు రావడానికి కూడా కారణం ఇదే అవుతుంది. అందుకే కన్యారాశివారికి కూడా పెళ్లి సూట్ కాదు కానీ అలా జీవితాన్ని గడిపేస్తారంతే.. 


Also Read: ఈ రాశులవారికి శాంతి, ఆ రాశులవారికి అశాంతి- సెప్టెంబరు నెల రాశిఫలాలు!


వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారు కొన్ని విషయాల్లో భయస్తులు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి దూరం దూరంగా ఉంటారు. ఈ కారణమే ఇద్దరి మధ్యా గ్యాప్ పెరగడానికి కారణం అవుతుంది. జంటగా కన్నా సింగిల్ గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని పెళ్లి చేసుకున్న వారికి ఇదో చిక్కుముడిలా మారుతుంది..వదులుకునేంత చెడ్డవారు కాదు కలసి ఉండేంత మంచివారూ కాదు అన్న డైలమాలో ఉండిపోతారు. అందుకే వృశ్చిక రాశివారి వివాహ బంధం అంత ఆనందంగా ఉండదు. వృశ్చిక రాశివారు పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లిచేసుకోకుండా ఉంటేనే సంతోషంగా ఉంటారు.


మకర రాశి
మకరరాశివారికి వ్యక్తిగత జీవితం మీద కన్నా పనిమీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ కారణంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్యా వివాదాలు చెలరేగుతాయి. ఇదే విషయంలో జీవిత భాగస్వామి బాధపడుతోందని తెలుసుకున్నప్పటికీ వీరిలో పెద్దగా మార్పుండదు..అందుకే ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయంటారు జ్యతిష్య శాస్త్ర నిపుణులు.