Mercury Transit 2022: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే

మేధస్సు,సామర్థ్యం,వ్యాపారాన్ని ప్రభావితం చేసే బుధుడు కన్యారాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 2 వరకూ ఈ తిరోగమనం కొనసాగుతుంది. ఈ ప్రభావం ఏ రాశులవారిపై ఎలా ఉందో చూద్దాం...

Continues below advertisement

Mercury Transit 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశిమార్పు ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఆగస్టు 21 నుంచి కన్యారాశిలో సంచరిస్తున్న బుధుడు..సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 2 వరకూ అదే రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఏ రాశులపై ప్రభావం ఎలా ఉంటుందంటే..

Continues below advertisement

మేషం
మేష రాశివారికి బుధుడు ఆరో స్థానంల సంచరిస్తున్నందున ఈ సమస్యలో మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. అధిక ఆలోచనలు వదులుకోవడం మంచిది. పెళ్లైనవారు అత్తింటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు నూతన ప్రయోగాలు, పెట్టుబడులు వద్దు. 

వృషభం
కన్యారాశిలో బుధుడి తిరోగమనం వృషభ రాశి వారికి  శుభ ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగం మారాలి అనుకున్నవారికి ఇదే మంచి అవకాశం. ఆర్థికంగా మెరుగుపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి.

మిథునం 
బుధుని తిరోగమన సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఈరాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 

Also Read: ఈ రాశులవారికి ఆర్థిక లాభం - ఆ రాశులవారికి అదనపు ఖర్చులు, సెప్టెంబర్ 5 నుంచి 11 వరకూ వారఫలాలు

కర్కాటకం
కన్యా రాశిలో బుధుడు తిరోగమనం ఈ రాశివారికి తార్కిక సామర్థ్యం పెరుగుతుంది కానీ గౌరవం తగ్గుతుంది. అవసరం అయినంతవరకూ మాట్లాడటమే మంచిది. ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోవడమే మంచిది. ఈ రాశి వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులకు బాగానే ఉంటుంది.

సింహం 
కన్యారాశిలో బుధుడి తిరోగమనం సింహరాశివారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య కొంత దూరం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ మాటలపై సంయమనం పాటించాలి. 

కన్య 
కన్యారాశిలో ఉన్న బుధుడు కన్యారాశిలోనే తిరోగమనం చెందుతున్నాడు. ఈ ఫలితంగా ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో ఇమేజ్ పెరుగుతుంది.  

తుల
బుధుడు తిరోగమనంలో ఉన్న కాలంలో అంటే సెప్టెంబరు 10 నుంచి అక్టోబరు 2 వరకూ ఈ రాశివారు కోపాన్ని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు.  ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం  
తిరోగమనంలో ఉన్న బుధుడు వృశ్చిక రాశి వారికి భారీగా లాభాలను ఇస్తాడు. ఈ రాశివారికి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ సాధిస్తారు. వ్యాపారులు రాణిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి డబ్బు, పలుకుబడి, హోదా అన్నీ కలసొస్తాయి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

Also Read: కన్యారాశిలోకి సూర్యుడు, ఈ నాలుగు రాశులవారికి మామూలుగా లేదు!

ధనుస్సు 
ధనస్సు రాశివారికి కూడా బుధుడి తిరోగమనం కలిసొస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి.

మకరం 
కన్యా రాశిలో బుధుడి తిరోగమనం చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. మీకు సంబంధించిన క్లిష్టమైన సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

కుంభం
కుంభ రాశివారికి కన్యారాశిలో బుధుడి తిరోగమనం ప్రతికూల సమయమనే చెప్పాలి. పని ఒత్తిడి పెరుగుతుంది, మాట పట్టింపులు వస్తాయి, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కాస్త సహనంతో వ్యవహరిస్తేనే పని జరుగుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

మీనం
బుధుడు మీకు ఏడో స్థానంలో సంచరిస్తున్నందున మీకు అన్నీ అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో సక్సెస్ ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. అయితే ప్రతి విషయంలోనూ వాదించే గుణం కలిగిఉండడం వల్ల ఇంట్లో కాస్త ఆశాంతిగా ఉంటుంది. జీవిత భాగస్వామిపై అనుమానం పెరుగుతుంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola