ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఇద్దరు దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్. ఎక్స్ (ట్విట్టర్) సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అయితే, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్. వీరు కేజ్ ఫైట్‌కి సవాలు చేసుకున్నప్పటి నుంచి ఇంటర్నెట్‌లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ కూడా వచ్చింది. తనకు ఎంఆర్ఐ, శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నందున దీని డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని ఎలాన్ మస్క్ తెలిపారు.


వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ పోరాటంపై మస్క్ ఆశాజనకంగా ఉన్నాడు. ఈ వారం ప్రోగ్రామ్ గురించి కచ్చితమైన సమాధానం ఇస్తానని ఆశిస్తున్నాడు. మార్క్ జుకర్‌బర్గ్ మాత్రం పోరాడాలని బాగా ఉత్సాహంగా ఉన్నాడు. ఆగస్టు 26వ తేదీన పోరాటం చేయాలని తాను ప్రపోజ్ చేసినట్లు మార్క్ తెలిపాడు. కానీ మస్క్ దీనిపై ఇంకా స్పందించలేదు. మార్క్ జుకర్‌బర్గ్‌ను సస్పెన్స్‌లో ఉంచాడు. జుకర్‌బర్గ్ మాట్లాడుతూ ‘నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను. అతను మొదటిసారి ఛాలెంజ్ చేసినప్పుడు నేను ఆగస్టు 26వ తేదీని సూచించాను. కానీ అతను దానిని ధృవీకరించలేదు.’ అని థ్రెడ్స్‌లో పోస్ట్ చేశాడు.


గత జూన్‌లో వరుస సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఈ ఇద్దరు దిగ్గజాలు కేజ్ ఫైట్‌కు అంగీకరించారు. మొదట్లో దీనిపై పెద్దఎత్తున చర్చ జరిగినా జూన్ నెలాఖరుకు దానిపై చర్చ ఆగిపోయింది. మార్క్ జుకర్‌బర్గ్ అయితే పోటీ అసలు జరుగుతుందా లేదా అనే దానిపై అనిశ్చితిని కూడా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రస్తుతం ట్విటర్‌ని ఎక్స్‌గా రీబ్రాండింగ్‌లో నిమగ్నమై ఉన్న ఎలోన్ మస్క్, కేజ్ ఫైట్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని, దాని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 


దీని తరువాత ట్విట్టర్ సీఈవో లిండా యాకారినో కూడా మస్క్ ట్వీట్‌పై వ్యాఖ్యానించారు. ఈ గొప్ప మ్యాచ్‌ని చూడటానికి తన క్యాలెండర్‌ను క్లియర్ చేస్తున్నట్లు రాశారు. మార్క్ జుకర్‌బర్గ్ ఆత్రుతతో, అలాగే శస్త్రచికిత్స గురించి మస్క్ ఇటీవలి ప్రకటనలతో జరగబోయే పోరాటంపై ఇరుపక్షాలు సమానంగా ఆసక్తి చూపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఎప్పుడు జరుగుతుందనేదే ప్రస్తుతం సస్పెన్స్.














Read Also: గూగుల్ కాకుండా బెస్ట్ సెర్చింజన్లు ఇవే - టాప్ 5 స్థానాల్లో ఏం ఉన్నాయి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial