Independence Day Features :  వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున  ప్రకటించారు. ఇది ఆషామాషీ ప్రకటన కాదు. సంకల్పం.  దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడాన్ని  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది రాజకీయ పార్టీల లక్ష్యం కాదు. దేశ లక్ష్యం.  2047 నాటికి  లక్ష్యాలను సాధించడమే.. టార్గెట్‌గా పెట్టుకున్నారు. 
 
భారత్ ముందు ఉన్న భవిష్యత్ లక్ష్యాలు                           


1. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ 
2.  బానిసత్వ చిహ్నాల్సేవీ లేకుండా రూపుమాపడం
3. వారసత్వ సంపదపై గర్వం, ఐక్యత 
4. ప్రస్తుతం ముందున్న బాధ్యతల్ని నెరవేర్చడం 


ప్రపంచంలో ఎక్కువ యువశక్తి ఉన్న దేశం                        
   
ఈ లక్ష్యాలను సాధించాలంటే  వచ్చే పాతికేళ్లలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే ఏ దిశగా అడుగులు వేయాలి.. ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి..? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక విజన్‌ ప్రణాళికను రూపొందించేందుకు దేశంలో మేధావులంతాపనిచేస్తున్నారు.   ప్రస్తుతం ప్రపంచంలో యువత గణనీయంగా ఉన్న దేశం భారత్ ఒకటే.  అమెరికా, ఐరోపాల్లో వృద్ధులు పెరిగిపోతున్నారు. చివరకు చైనాలో కూడా వయసు పైబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పనిచేయగలిగిన యువ శక్తి మన వద్దే పుష్కలంగా ఉంది. దీనిని ఆధారం చేసుకుని మనం ప్రపంచంలో అగ్ర స్థానంలోకి ఎలా చేరుకోవాలన్నదానిపై గురి పెట్టాలనేది నిపుణుల సూచనలు.  సరైన దిశలో వెళ్తే వచ్చే పాతికేళ్లలో మనం ప్రపంచంలో రెండో అగ్రదేశంగా నిలిచే అవకాశం ఉంది.   ఇది మాటలతో జరగదు. కచ్చితమైన ప్రణాళికతో పనిచేయాల్సి ఉంటుంది.  


పాతికేళ్ల ప్రణాళికలు అమృత్ కాల్‌తో ప్రారంభం                          


వచ్చే 25 సంవత్సరాలలో, భారతదేశం 75 వద్ద నుండి 100 వద్ద భారతదేశం వరకు మార్గనిర్దేశం చేసేందుకు ఆర్థిక వ్యవస్థకు పునాదిని అందించడం కోసం అమృత్ కాల్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  అమృత్ కాల్  లో  భాగంగా  25 సంవత్సరాల కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిద్ధం చేశారు.  భారతీయ పౌరుల జీవితాల మెరుగుదల,  గ్రామీణ , నగరాల మధ్య అభివృద్ధి అంతరాన్ని తగ్గించడం,  ప్రజల జీవితాల్లో ప్రభుత్వ చొరబాట్లను తొలగించడం,  అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.  అన్నీ కలిసిన సంక్షేమంపై సూక్ష్మ ఆర్థిక దృష్టి వృద్ధిపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు ఫిన్‌టెక్ టెక్నాలజీ-ఎనేబుల్డ్ ఎవల్యూషన్, ఎనర్జీ ట్రాన్సిషన్  వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నారు. 


భారత్‌కు ఓ స్పష్టమైన లక్ష్యం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన వందేళ్లల్లా.. ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటిగా మారనుంది. ఇందు కోసం అమృత్ కాల్ ప్రణాళికలు అమలవుతున్నాయి.