మీరు మాట్లాడేది మీ ఫోన్ వింటుందా? హ్యాకింగ్, స్కామ్, మోసం, బ్లాక్‌మెయిలింగ్ మొదలైన వివిధ వార్తలను బట్టి మా ద్వారా ఈ డిజిటల్ యుగంలో అన్నీ సాధ్యమేనని మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నా... ఎక్కడో కూర్చున్న ఒక వ్యక్తి మీ బ్యాంక్ వివరాలను తెలుసుకోవచ్చు. అంటే ఈ డిజిటల్ యుగంలో ఎక్కడి నుంచైనా ఏదైనా చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. మీ ప్రైవసీని మరింత మెరుగుపరిచే ఒక ముఖ్యమైన సెట్టింగ్ గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది ఈ సెట్టింగ్‌ని ఆన్‌లో ఉంచుతారు. దానిపై ఎక్కువ శ్రద్ధ చూపరు.


ఇప్పుడు మనం మాట్లాడుకునే సెట్టింగ్ - మైక్రోఫోన్ యాక్సెస్. ఈ రోజుల్లో ప్రతి యాప్ మన మైక్రోఫోన్‌కు యాక్సెస్ కోసం అడుగుతుంది. మీరు ఫోన్‌లో థర్డ్ పార్టీ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి ఎలా పనిచేస్తాయనే దాన్ని అంచనా వేయడం కష్టం. వారు మీ వాయిస్ లేదా సంభాషణను రహస్యంగా వినగలరు, మీ డేటా కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది.


మీరు ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుతుంటే, దానికి సంబంధించిన ప్రకటనలు మొబైల్‌లో రావడాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. వాయిస్ అసిస్టెంట్‌ని యాక్టివ్‌గా ఉంచడం, అది మైక్రోఫోన్‌కు యాక్సెస్‌ను పొందడం వల్ల ఇది జరుగుతుంది.


ఒక యాప్‌తో మీకు పని పూర్తవ్వగానే దానికి సంబంధించిన అన్ని యాక్సెస్‌లను తీసేయండి. అప్పుడు మీ సంభాషణను మరెవరూ వినలేరు. డేటా లీకేజీకి దారి తీసే అవకాశం ఉన్నందున అనవసరంగా ఏదైనా యాప్‌కు అనుమతి ఇవ్వవద్దు. ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఆప్షన్‌ను తెలుసుకున్న తర్వాత/అర్థం చేసుకున్న తర్వాత ఎంచుకోండి. పూర్తిగా చదవకుండా దేనినీ ఎంచుకోవద్దు. ఫోన్‌లో విశ్వసనీయ యాప్‌లను మాత్రమే ఉంచండి. థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లు, యాప్‌లకు వీలైనంత దూరంగా ఉండండి. అలాగే మీ నంబర్, మెయిల్ ఐడీ, బ్యాంకింగ్ వివరాలను ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ షేర్ చేయవద్దు.


మరోవైపు గూగుల్ డార్క్ వెబ్ రిపోర్టింగ్ ఫీచర్‌ను కూడా గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా మనదేశంలో అందిస్తుంది. డార్క్ వెబ్ అనే పదాన్ని మనం ఇప్పటికే చాలా సార్లు విని ఉంటాం. కేవలం కొన్ని బ్రౌజర్ల ద్వారా మాత్రమే ఈ డార్క్ వెబ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇంటర్నెట్ యాక్టివిటీని ఎవరికీ తెలియకుండా, ప్రైవేట్‌గా ఉంచడమే డార్క్ వెబ్ ప్రత్యేక. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు కూడా డార్క్ వెబ్ ద్వారా సాగుతూ ఉంటాయి. ఎన్నో పెద్ద కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించిన సెన్సిటివ్ డేటా డార్క్ వెబ్‌లో చాలా సార్లు లీక్ అయింది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial